Homeతెలుగు Newsగ్లామర్ ప్రపంచంలో బాధితులే నిందితులు !

గ్లామర్ ప్రపంచంలో బాధితులే నిందితులు !

Zarine Khan

సినిమా, టీవీ ఇలా ఇండస్ట్రీ ఏదైనా కానీ, అదొక గ్లామర్ ప్రపంచం. ముఖ్యంగా అందమైన అమ్మాయిల లోకం. ఆ అందాల వెనుక అనేక రంగులు ఉంటాయి. ఆ రంగుల మధ్యలో అనేక ఆపదలు తలెత్తుతుంటాయ్. వాటిల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది క్యాస్టింగ్ కౌచ్ గురించి. అసలు ఈ క్యాస్టింగ్ కౌచ్ సినిమా ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచి ఉంది అంటారు. కానీ, మొదట బయటకు రావడం అనేది బాలీవుడ్ లోనే పురుడు పోసుకుంది. ఈ క్రమంలో ఎందరో హిందీ భామలు తమ అవకాశాల మాటున దాగి ఉన్న చీకటి కీచక పర్వాల గురించి కథలు కథలుగా చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒక్కోసారి నటీమణులు లైంగికదాడిని మించిన బాధను అనుభవించాల్సి వస్తోంది. తాజాగా జరీన్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో తీవ్ర ఆరోపణలు చేసింది.

హీరోయిన్ జరీన్ ఖాన్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏ సినిమా ఆఫీస్ కి వెళ్లినా తన తల్లి వెంట వచ్చేదని జరీన్ ఖాన్ చెప్పారు. ఐతే, ‘మీ అమ్మ ఎందుకు వచ్చింది జరీన్ ?, ఈ సారి మాత్రం ఆమె లేకుండా నువ్వు ఒంటరిగా రా అని పిలిచే వారు అని, వారి ఉద్దేశం తెలుసుకోవడానికి తనకు కొంత సమయం పట్టిందని జరీన్ ఖాన్ తెలిపింది. నాన్న సినిమాల వైపు వెళ్లవద్దని ఎందుకు అన్నారో తనకు అప్పుడు అర్థమైందని జరీన్ ఖాన్ ఎమోషనల్ అయ్యింది. ఇక క్యాస్టింగ్ కౌచ్ అడిగే వారి కోరికలను తీర్చకపోతే.. కూతురిగా, చెల్లెలుగా నటించేందుకు ఒప్పుకోవాల్సి వస్తోంది అని, హీరోయిన్ వేషం సంపాదించుకోవాలి అంటే మాత్రం.. ఎన్నో త్యాగం చేయాల్సి ఉంటుందని జరీన్ ఖాన్ చెప్పుకొచ్చింది.

మొత్తానికి క్యాస్టింగ్ కౌచ్ ఎలా ఉంటుందో తనకు కూడా పరిచయం అయింది అని జరీన్ ఖాన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఐతే, జరీన్ ఖాన్ కామెంట్స్ కి కొందరు నెటిజన్లు మరోలా కామెంట్స్ పెడుతున్నారు. ఇద్దరు వ్యక్తులు పరస్పర అంగీకారంతో చేసుకునే రొమాన్స్ ను అసలు కాస్టింగ్ కౌచ్ అనడం ఎంతవరకు కరెక్ట్ జరీన్ ఖాన్ ?. నీ గురించి నీకు సినిమాలు ఎలా వచ్చాయో మాకు తెలియదా ఏమిటి ? అంటూ జరీన్ ఖాన్ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. గతంలో హీరోయిన్ రాణి ఛటర్జీ గురించి కూడా ఇలాంటి కామెంట్సే పెట్టారు నెటిజన్లు. దర్శకుడు సాజిద్‌ ఖాన్‌పై భోజ్‌పురి స్టార్ హీరోయిన్‌ రాణి ఛటర్జీ తీవ్ర ఆరోపణలు చేసింది.

ఓ సినిమా గురించి మాట్లాడదామని పిలిచి, సాజిద్‌ తన రొమ్ము సైజ్‌ అడిగాడని, తన బాయ్‌ఫ్రెండ్‌తో ఎన్నిసార్లు సెక్స్‌ చేశానో కూడా అడిగాడని రాణి ఛటర్జీ తెలిపింది. తన లాంగ్‌ స్కర్ట్‌ను పైకి ఎత్తి కాళ్లు చూపించమన్నాడని, తనను అసభ్యకరంగా టచ్‌ చేసే ప్రయత్నం కూడా చేశాడని రాణి ఛటర్జీ పేర్కొంది. ఐతే, ఆ తర్వాత రాణి ఛటర్జీ పై ఫైర్ అయ్యారు. నువ్వు ఏమైనా అలియా భట్ అనుకున్నావా ?, లేక కియారా అద్వానీ అనుకున్నావా ? నీకు ఛాన్స్ లు ఇవ్వడానికి అంటూ ఆమె పై రెచ్చిపోయారు కొందరు నెటిజన్లు. ఇప్పుడు జరీన్ ఖాన్ వంతు వచ్చింది. మొత్తమ్మీద సోషల్ మీడియా పుణ్యమా అంటా ఇక్కడ బాధితులే నిందితులుగా మారాల్సి వస్తోంది.

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu