అభిమన్యుడు మూవీ రివ్యూ

movie-poster
Release Date

అభిమన్యుడు మూవీ రివ్యూ
చిత్రం : అభిమన్యుడు
నటీనటులు : విశాల్‌, సమంత, అర్జున్‌, ఢిల్లీ గణేశ్‌,
సంగీతం : యువన్‌ శంకర్‌ రాజా
సినిమాటోగ్రఫీ : జార్స సి. విలియమ్స్‌
ఎడిటింగ్‌ : రుబెన్‌
నిర్మాత : విశాల్‌
కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం : పి. ఎస్‌. మాత్రన్‌
బ్యానర్‌ : విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ
విడుదల తేదీ : 01-06-2018

ఈ ట్రెండ్‌ లో యువ కథానాయకులు కథలు ఎంచుకునే కథ తీరు పూర్తిగా మారిపోయింది. ఇదివరకు ఆరు పాటలు, ఆరు ఫైట్‌లు అంటూ లెక్కలు చూసుకుని సినిమాలు తీసే రోజులు ఎప్పుడో మారిపోయాయి. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉంటునే సామాజిక సమస్యల ఇతివృత్తంగా వచ్చే కథలకు మరో ఆలోచన లేకుండా వచ్చజెండా ఊపుతున్నారు. తమిళంలో ఇతర కథానాయకులతో పోలిస్తే విశాల్‌ శైలి కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇటీవలే డిటెక్టివ్‌ సినిమాతో ఓ కొత్త తరహా కథతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విశాల్‌ తాజాగా లక్షల మంది ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న సైబర్‌ మోసాల నేపథ్యంలో తీసిని చిత్రం ‘అభిమన్యుడు’ ‘ఇరుంబుతిరై’గా తమిళంలో విడుదలై ఘన విజయం సాధించిన ఈ చిత్రం కాస్త ఆలస్యంగా తెలుగులో విడుదలైంది. మరి శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన అభిమన్యుడు ఎలా ఉన్నాడు? సైబర్‌మోసాలను ఎలా ఎదుర్కొన్నాడు? విశాల్‌ ఖాతాలో మరో విజయం పడిందా ?

కథ : ఈ సినిమాలో హీరో (విశాల్‌) పాత్ర పేరు ‘కరుణాకర్‌’ ఇతను మిలటరీ ఆఫీసర్‌. కోపం ఎక్కువ. తన కళ్ల ముందు అన్యాయం జరుగుతుంటే భరించలేడు. ఈ కోపం కారణంగానే సస్పెండ్‌కు గురివుతాడు. కోపాన్ని తగ్గించుకోవడానికి యాంగర్‌ మేనేజ్‌మెంట్‌ క్లాసులు తీసుకుంటాడు. ఇందుకోసం (సమంత) లతాదేవి అనే డాక్టర్‌ను కలుస్తాడు. కరుణాకర్‌ కోపానికి కారణం అతని గతమేనని తెలుసుకుంటుంది డాక్టర్ లత. అందుకే ఎప్పుడో వదిలేసిన తన ఇంటికి మళ్లీ వెళ్లమని సలహా ఇస్తుంది. దాంతో కరుణాకర్‌ తన ఊరికి వెళ్తాడు. చెల్లెలు ప్రేమించిన అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధమౌతాడు. అందుకోసం రూ.10 లక్షలు అవసరం అవుతాయి. ఊరిలో ఉన్న ఆస్తిని అమ్మితే వచ్చిన రూ. 4 లక్షలు, బ్యాంకులో మరో 6 లక్షలు అప్పు తీసుకుని బ్యాంకులో ఉంచుతాడు. ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. బ్యాంకులో ఉన్న రూ.10 లక్షలు సడన్‌ గా మాయం అవుతాయి. కరుణాకర్‌ పదిలక్షలు మాత్రమే కాదు. ఇలా కొన్ని వందల, వేల మంది బ్యాంకు అకౌంట్లను హ్యాక్‌ చేసి ఆ సొమ్మును విలన్‌ (అర్జున్‌) వైట్‌ డెవిల్‌ తన ఖాతాలోకి మార్చుకుంటాడు. ఇంతకీ వైట్‌ డెవిల్‌ ఎవరు? సైబర్ నేర సామ్రాజ్యాన్నికరుణాకర్‌ ఎలా ఢీ కొట్టాడు, ఎలా ఛేదించాడన్నది మిగతా కథ.

నటీనటులు : హీరో విశాల్‌ తన పాత్రకు పూర్తిగా న్యాయం చేసాడు. గతచిత్రాలతో పోలిస్తే ఇందులో మెచ్యూర్డ్‌గా కనిపిస్తాడు. అనవసరమైన హీరోయిజాలకి పోకుండా ఎక్కడ ఏమి చేయలో అదే చేస్తూ తన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీన్స్‌లో బాగా నటించాడు. మిలటరీ ఆఫీసర్‌గా బాగున్నాడు. ఈ కథకు విలన్‌ అర్జున్‌ పాత్ర హైలైట్‌ గా నిలిచింది. తన స్టెలిష్‌ నటనతో కథను ఓ రేంజ్‌కు తీసుకువెళ్ళాడు. అర్జున్‌ రాకతో ఈ కథ స్వరూపమే మారిపోయింది. విశాల్‌-అర్జున్‌ల మధ్య సాగే సన్నివేశాలు సూపర్బ్, వాళ్లు వేసుకునే ఎత్తుకు పైఎత్తులు బాగున్నాయి. సమంతది కూడా ప్రాధాన్యం ఉన్న పాత్రే. సమంత లాంటి స్టార్‌ హీరోయిన్‌ ఉంది కదాని..దర్శకుడు డ్యూయెట్ల జోలికి పోలేదు. విశాల్‌-సమంతల మధ్య ఒకే ఒక పాట తీశాడు. మిగిలిన వాళ్లు అందరూ తమిళ నటీనటులే.

విశ్లేషణ : సినిమా మొత్తం సైబర్‌ క్రైమ్‌ నేపథ్యంలో నడుస్తుంది. మనం రోజూ పేపర్లో చూస్తున్న సైబర్ నేరాలే ఇవి. మన అకౌంట్లో ఉన్న డబ్బును మనకు తెలియకుండానే సైబర్ నేరగాళ్లు మాయం చేసే విధానాలను చాలా చక్కగా తెరకెక్కించాడు. అసలు ఈ సైబర్ క్రైమ్ నేరాలు ఎలా జరుగుతాయన్న వాటిని చాలా విపులంగా అందరికీ అర్థమయ్యేలా వివరించాడు. కథ ప్రారంభంలో సాధారణంగా ఉన్నా సైబర్ క్రైమ్ వ్యవహారం జోడించిన తర్వాత కథ ఓ కొత్త దారిలో వెళుతుంది. సైబర్ క్రైమ్ నేరాలు, మరోవైపు కరుణాకర్ జీవితాన్ని సమాంతరంగా చూపిస్తూ రెండు కథలను ఒకే చోట కలిపే విధానం బాగుంది. యువన్ సంగీతం అందరినీ ఆకట్టుకుంటుంది. జార్జ్ సినిమాటోగ్రఫీ బాగుంది. డైలాగ్స్ బాగా పేలాయి, ఎడిటింగ్ బాగుంది.

హైలైట్స్
కథ, సంగీతం
విశాల్ నటన, అర్జున్ పాత్ర

డ్రాబ్యాక్స్
ఫస్టాఫ్‌లో కథ సాగదీత

చివరిగా స్మార్ట్ టెక్నాలజీ వాడుకునే ప్రతిఒక్కరూ చూడాల్సిన సినిమా
(గమనిక : ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Critics METER

Average Critics Rating: 3
Total Critics:3

AUDIENCE METER

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
movie-poster

Critic Reviews for The Boxtrolls

స్మార్ట్ టెక్నాలజీ వాడే ప్రతిఒక్కరూ చూడాల్సిన సినిమా
Rating: 3/5

https://www.klapboardpost.com

సైబర్ వ్యూహాన్ని ఛేదించి ఈ అభిమన్యుడు గెలిచాడు
Rating: 2.75/5

www.telugu360.com

అభిమన్యుడు.. అలరిస్తాడు.. ఆలోచన రేకెత్తిస్తాడు
Rating: 2.75/5

http://www.tupaki.com