ఆ విజువల్స్‌ను మాటిమాటికీ ప్రసారం చేయాద్దు: మనోజ్

ప్రముఖ నటుడు నందమూరి హరికృష్ణ నల్గొండ జిల్లాలోని అన్నెపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మరణించాడన్న వార్త ఆయన కుటుంబ సభ్యులనే కాకుండా.. నందమూరి అభిమానులను, టాలీవుడ్ చిత్రపరిశ్రమను దిగ్బ్రాంతికి గురయ్యేలా చేసింది. హరికృష్ణ యాక్సిడెంట్ దృశ్యాలను మీడియాలో ప్రసారం అయ్యాయి. ఈ దృశ్యాలపై మంచు మనోజ్ స్పందించారు.

“హరికృష్ణ గారు చనిపోయిన సమయంలో తీసిన విజువల్స్‌ను మాటిమాటికీ ప్రసారం చేయొద్దని మీడియా వర్గాలను వేడుకుంటున్నాను. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్న కుటుంబీకులకు అది మరింత బాధకలిగించినట్లు అవుతుంది. ఆయన మన అందరివాడు. గౌరవించండి. నా విన్నపాన్ని మన్నిస్తారని ఆశిస్తున్నాను” అని ట్వీట్ చేశాడు మనోజ్.