‘పేపర్‌ బాయ్’‌ మూవీ టీజర్‌

సంపత్‌ నంది టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌లో తెరకెక్కిన చిత్రం ‘పేపర్‌ బాయ్’‌. రామ్‌చరణ్‌, రవితేజ, గోపిచంద్ లాంటి హీరోలతో మాస్‌ కమర్షియల్ ఎంటర్‌టైనర్లను తెరకెక్కించిన సంపత్‌ నంది తన స్వీయ నిర్మాణంలో ఈ సినిమాలు రూపొందిస్తున్నారు. తను నేను సినిమాతో పరిచయం అయిన సంతోష్ శోభన్ హీరోగా జయ శంకర్‌ను దర్శకుడి పరిచయం చేస్తూ పేపర్‌ బాయ్ సినిమాను తెరకెక్కించారు.

సపంత్ నంది స్వయంగా కథా కథనాలు అందించిన ఈ చిత్రంలో రియా సుమన్‌ , తాన్యాహోపేలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం మూవీ ఆడియో, సినిమా రిలీజ్‌ తేదీలను త్వరలోనే వెల్లడించనున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించనున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates