ప్రియాంక పెళ్లిచేసుకోకపోయినా ఫర్వాలేదట!

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, హాలీవుడ్ నటుడు నిక్ జోనాస్ ప్రేమలో ఉన్నారని కొంతకాలంగా నెట్‌లో వార్తలు, ఫొటోలు హల్‌చల్
చేస్తున్నాయి. తాజాగా వీరిద్దరూ కలిసి రెస్టారెంట్లకు వెళ్లడం, డిన్నర్ చేయడం చూస్తుంటే వీరిద్దరి మధ్య ఏదో ఉందనే అనిపిస్తోంది. ఈ మధ్య వీరిద్దరూ ఓ రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు తీసిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రియాంకపై వస్తున్న వార్తల గురించి ఆమె తల్లి మధు కొట్టిపారేస్తున్నారు. ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని అన్నారు. ప్రియాంక
పెళ్లిచేసుకోకపోయినా ఫర్వాలేదు కానీ విదేశీ వ్యక్తిని మాత్రం తన అల్లుడిగో ఒప్పుకోనని తెగేసి చెబుతున్నారు. ప్రియాంక విదేశీ వ్యక్తిని చేసుకుంటే తాను భరించలేనని అన్నారు. ఒకవేళ ప్రియాంకకు సరైన జోడీ దొరక్క పెళ్లి కాకుండా ఉండిపోయినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. ప్రియాంక ప్రస్తుతం రెండు హాలీవుడ్‌ సినిమాలతో బిజీగా ఉన్నారు. నిక్ విషయంలో తనపై వస్తున్న వదంతులపై ప్రియాంక ఇంకా స్పందించలేదు.