‘బ్రాండ్‌ బాబు’ ట్రైలర్‌

యూత్‌ఫుల్‌ కామోడీ ఎంటర్‌టైనర్‌గా మారుతి దర్శకత్వంలో వహిస్తున్న చిత్రం ‘బ్రాండ్‌ బాబు’. ప్రభాకర్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో సుమంత్‌ శైలేంద్ర హీరోగా పరిచయం కాబోతున్నాడు. మారుతి కథను అందించగా.. జేబీ మ్యూజిక్‌ సమకూర్చాడు. ఈ చిత్రంలో తెలుగమ్మాయి ఈషా రెబ్బా హీరోయిన్‌గా నటిస్తోంది. రాజా రవీంద్ర, మురళీ శర్మ, సాయి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నఈ చిత్ర ట్రైలర్‌ను యువ కథానాయకుడు అక్కినేని నాగచైతన్య ట్విటర్‌ ద్వారా విడుదల చేశారు.

ఈ ట్రైలర్‌లో నా పేరు ‘డైమండ్‌. ఇది నా ఫ్యామిలీ. డైమండ్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌.. అని గూగుల్‌లో సెర్చ్‌ చేస్తే మా కంపెనీ బ్రాండ్‌ విలువ తెలుస్తుంది. మనం వేసుకునే దుస్తులకే ఇంత ప్రాముఖ్యత ఇస్తాం. మన ఇంటికి వచ్చే అమ్మాయి విలువ ఏ రేంజ్‌లో ఉండాలి డాడ్‌‌’ అని సుమంత్‌ చెప్తున్న డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలైంది. హీరో.. పని మనిషి(ఈషా రెబ్బా)ను చూసి ఇష్టపడతాడు. అది సుమంత్‌ తండ్రికి నచ్చదు. మురళి శర్మ ఫన్నీగా చెప్పే డైలాగులు బాగున్నాయి. ఈషా రెబ్బా తండ్రి పాత్రలో రాజారవీంద్ర నటించాడు. ఇంటికి కాబోయే కోడలికి డబ్బులేదని మురళి బాధపడతాడు. మురళి శర్మ ఎదురుగా దర్జాగా కూర్చుని రాజా రవీంద్ర.. ‘వియ్యంకులుగారూ.. మా దగ్గర డబ్బులేదనే కదా మీ బాధ. మీరు దుస్తులు షోరూంలలో కొంటే మేం సెకెండ్స్‌లో కొంటాం’ అనే డైలాగ్‌ ఫన్నీగా ఉంటుంది. కమెడియన్‌ వేణు.. సుమంత్‌కు అన్నం వడ్డిస్తూ..’గుత్తి వంకాయకు కూడా బ్రాండ్‌ ఉంటుందా బాబూ..’ అంటుంటే.. అవును అని హీరో అనడంతో ట్రైలర్‌ ముగుస్తుంది.