‘మీ అమ్మ(శ్రీ దేవి) నీ రూపంలో జీవించే ఉంది’

దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్‌ సినిమాల్లోకి రాకముందే సోషల్‌మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది. ఎక్కువగా తన తల్లితో కలిసి దిగిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తుండేవారు. తన తొలి సినిమా ‘ధఢక్‌’ త్వరలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఆమెకు మరింత ఫాలోయింగ్‌ పెరిగిపోయింది. ప్రస్తుతం జాన్వికి ఇన్‌స్టాగ్రామ్‌లో 1.9 మిలియన్‌ నెంబర్‌ ఫాలోఅవుతున్నారు

ఇప్పుడు జాన్వి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఫొటో దాదాపు కొన్ని గంటలోనే రెండు లక్షల లైక్స్‌, వేలాది కామెంట్స్‌ తో వైరల్‌ అవుతోంది. ఈ ఫొటో అంత ప్రత్యేకత లేనప్పటీకి జాన్విని చూసిన నెటిజన్లు మాత్రం తెగ మూరిసిపోయి కామెంట్లు కురిపిస్తున్నారు. ‘అచ్చు శ్రీదేవిలానే ఉన్నావు’ ‘నీలో శ్రీదేవిని చూస్తున్నామని’ ‘మీ అమ్మ(శ్రీ దేవి) నీ రూపంలో జీవించే ఉంది’అంటూ అభిమానులు పలు కామెంట్స్‌ పెడుతున్నారు.