మీ పులి వేషం వేసుకున్న నక్కకి చెప్పిండి.. వానలోకి వెళ్లొద్దని : శ్రీ రెడ్డి

టాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌ అంశాన్ఇ తెరపైకి తీసుకొచ్చి, అంతకు మించి తన మాటలు, ట్వీట్స్‌, పోస్టలతో పలువురిపై నటి శ్రీరెడ్డి ఆరోపణలు చేస్తు పలు వివాదలకు తెర తీసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే టాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌ వ్యవహారంలో పలువురు సినీ సెటబ్రిటీల గుట్టు విప్పిన శ్రీరెడ్డి తాజాగా తమిళ ఇండస్ర్టీ మీద కూడా పడ్డారు. అయితే శ్రీరెడ్డి పరిటాల రవి పేరు చెప్పుకుంటూ.. సోషల్‌ మీడియాలో చేసిన పోస్ట్‌ కలకలం రేపుతోంది.

శ్రీరెడ్డి తన ఫేస్‌బుక్‌లో ‘బొమ్మ హీరో కాదురా గొర్రెల్లారా, నిజమైన హీరో రా పరిటాల రవి. ఆయనే ఉండుంటే.. గడ్డానికి, జుట్టుకి పెయింటింగ్‌లు వేసుకునేవాళ్లు. గడ్డం పెంచుకుంటే. ప్రసంగాల్లో అరుస్తూ డైలాగ్‌లు చెబితే చెగువేరా అవుతారా.. నిద్ర లేవండి గొర్రెల్లారా.. అసలే వర్షాకాలం రా నాయన వానలోకి వెళ్లొద్దని చెప్పండి రంగు పోద్ది.. మీ పులి వేషం వేసుకున్న నక్కకి’ అని పోస్ట్‌లో పేర్కిన్నారు. ఈ పోస్ట్‌పై జనసేన అభిమానులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.