మ‌ళ్ళీ జ‌త కట్ట‌నున్న హిట్ జంట‌

అనుష్క న‌టించిన చివ‌రి రెండు చిత్రాలు భారీ బ‌డ్జెట్ తో రూపొందించిన‌వే. ఈ రెండు చిత్రాలు మంచి విజ‌యాల‌ను సొంతం
చేసుకున్నాయి. బాహుబ‌లి సిరీస్ త‌ర్వాత అనుష్క భాగ‌మ‌తి చేసింది. భాగ‌మ‌తి కూడా హిట్ కావ‌డంతో …అనుష్క నెక్ట్స్
సినిమా ఏం చేస్తుందోన‌ని ప్రేక్ష‌కులు ఎదురుచూస్తున్నారు.

అయితే, తాజా స‌మాచారం ఏంటంటే అనుష్క నెక్ట్స్ చేయ‌బోయే సినిమా ఏమిటి అనే దానిపై క్లారిటీ వ‌చ్చింది. నా నువ్వే
సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన జ‌యేంద్ర ద‌ర్శ‌క‌త్వంలో అనుష్క సినిమా చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమాలో
గోపీచంద్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. గోపీచంద్‌తో క‌లిసి అనుష్క శౌర్యం సినిమా చేసింది. అప్ప‌ట్లో ఆ సినిమా మంచి హిట్‌.
ఈ మ‌ధ కాలంలో వీళ్లిద్దరి కాంబినేష‌న్లో ఏ సినిమా రాలేదు. ఇప్పుడు మ‌ళ్లీ వీళ్ల కాంబినేష‌న్ రిపీట్ కావ‌డం విశేషం. ఈ
సినిమా కోసం అనుష్క బ‌రువు త‌గ్గేందుకు క‌స‌ర‌త్తులు ప్రారంభించింది. ఈ సినిమా త‌రువాత గోపీచంద్ త‌మిళంలో హిట్టైన
నాచియార్ సినిమాను తెలుగులో రీమేక్ చేయ‌నున్నారు. నాచియార్ లో జ్యోతిక పాత్ర‌లో అనుష్క చేస్తుందంట‌!