లాయర్ మార్తాండంగా పృథ్వీ

30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్‌ తో పాపులర్‌ అయిన నటుడు పృథ్వీ హీరోగా మీలో ఎవరు కోటీశ్వరుడు లాంటి కామెడీ ఎంటర్‌టైన్‌ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు మరో చిత్రం ‘మైడియర్ మార్తాండం’ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రం కోర్టు డ్రామా, కామెడీతో తెరకెక్కుతుంది.. ఈ మూవీలో లాయర్ మార్తాండంగా పృథ్వీ కనిపించనున్నాడు.

తన తదుపరి సినిమాలో 30 రోజుల్లో లాయర్ కావడం ఎలా అనే దానికి పృథ్వీ సమాధానం చెప్పనున్నాడు.. హరీష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మాజిన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు పవన్‌ సంగీతాన్ని అందించారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.. మీరూ చూడండి..