HomeTelugu Big Storiesతెలుగు బిగ్‌బాస్‌లో కమల్‌ సందడి

తెలుగు బిగ్‌బాస్‌లో కమల్‌ సందడి

తెలుగు బిగ్‌బాస్‌ షోలో నిన్న (శుక్రవారం) ఎపిసోడ్‌ ఆహ్లాదకరంగా జరిగింది. నిన్నటి ఎపిసోడ్‌లో ఇంటిసభ్యులకు నాని టివీ ద్వారా కమల్‌ హాసన్‌ సార్‌ వస్తున్నారు అని ప్రకటించాడు. ఇక నాని తానే స్వయంగా కమల్‌ హాసన్‌ ను ఇంటిలోకి ఆహ్వనించాడు. నాని కమల్‌కు ఆహ్వనం పలుకుతూ.. సాధారణంగా శని. ఆది వారల్లో తప్ప మిగిలిన రోజుల్లో రావడం ఇదే మొదటి సారి అన్నాడు. సార్‌ నేను మీకు చాలా పెద్ద అభిమానిని.. ఈ జూనియర్‌ హోస్ట్‌కు సీనియర్‌ హోస్ట్‌ని బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పంపడం ఆనందంగా ఉంది.. అన్నాడు. మీరు శని, ఆదివారల్లో వచ్చి ఉంటే నేను మీతో ఇంకాసేపు గడిపే అవకాశం ఉండేది అన్నాడు.

2a

దానికి కమల్‌ హాసన్‌ స్పందిస్తూ.. శని, ఆదివారాల్లో అక్కడ నా ఇంటిలో ఉండాలని ఫన్నీగా సమాధానం చెప్పారు. ఇక తెలుగు బిగ్‌బాస్‌ 54 వ రోజు ఇంట్లోకి లోకనాయకుడు కమల్‌ హాసన్‌ ఎంట్రీతో ఇంటి సభ్యులు ఆనందంలో తేలియాడారు. కమల్‌ను చూడగానే హౌస్‌మేట్స్ ఉద్వేగంతో ఊగిపోయారు. కమల్‌ పై తమకు ఉన్న అభిమానం వ్యక్తపరుస్తూ.. పాదాభివందనం చేశారు. నూతన్‌ నాయుడు తన పొలిటికల్‌ అనుభవంతో ఓ డైలాగ్‌ వినిపించారు. గీతా మాధురి, రోల్‌ రైడర్‌ పాటలు పాడి వినిపించారు. ఇక బాబు గొగినేని తనదైన శైలిలో కమల్‌కు పరిచయం చేసుకున్నాడు. కాగా కమల్‌ తాను బిగ్‌బాస్‌ హౌస్‌కి ‘విశ్వరూపం2’ ప్రమోషన్‌ కోసం వచ్చాను అని వెల్లడించారు. కాగా ‘విశ్వరూపం2’ మూవీ ట్రైలర్‌ను ఇంటి సభ్యులతో కలిసి వీక్షించారు.

2 3

ఇక ఇంటి సభ్యులకు మిలిటరీ టీ షర్ట్ప్‌ ను బహుకరించారు. బాబు గోగినేని కూడా కమల్‌కు ఓ టీ షర్ట్‌ను గిఫ్ట్ గా ఇచ్చాడు. ఆ తరువాత ‘విశ్వరూపం2’ టీం ఇంటిలోకి వచ్చి కాసేపు ఇంటి సభ్యులతో ముచ్చటించారు. అనంతరం కమల్‌ హాసన్‌ బిగ్‌బాస్‌ తనకు ఇచ్చిన స్పెషల్‌ పవర్‌ ను అమిత్‌కు ఇచ్చారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్ని రాష్ట్రాలు, భాషలు ఉన్నా భారతీయులుగానే భావించాలి. ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన అమిత్ తివారి తెలుగు నేర్చుకొని టాలీవుడ్‌లో రాణిస్తున్నందున అతడికి నేను పవర్ కార్డు ఇస్తున్నట్టు ప్రకటించారు.ఇంటి సభ్యులతో కాసేపు సరదాగా మాట్లాడిన తర్వాత కమల్ ఇంటి నుంచి నిష్క్రమించారు. అమిత్ మాత్రం కమల్ ఇచ్చిన షాక్‌ నుంచి చాలా సేపు తేరుకోలేకపోయారు. కమల్ ప్రేమకు పాత్రుడైనందుకు బిగ్‌బాస్‌కు థ్యాంక్స్ చెప్పారు. ఉద్వేగానికి లోనయ్యాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!