HomeTelugu Newsపద్మావత్ హీరోయిన్ కు సినిమాల్లేవా?

పద్మావత్ హీరోయిన్ కు సినిమాల్లేవా?

పద్మావత్ సినిమా తర్వాత బాలీవుడ్ అగ్ర కథానాయిక దీపికా పదుకొనే మరే చిత్రానికి ఒప్పుకోలేదు. ఎన్నో వివాదాల నడుమ పద్మావత్ సినిమా జనవరిలో విడుదలై బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 500 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా తర్వాత దీపికా పదుకొనే మరే సినిమా ఒప్పుకోకపోవడానికి కారణం తాను మెచ్చిన పాత్రలు రాకపోవడం ఒక కారణమైతే, తాను మెడనొప్పితో బాధపడటం కూడా మరో కారణంగా తెలుస్తోంది.

2 5

మరోవైపు దీపికా పదుకొనె తన ప్రియుడైన రణవీర్ సింగ్ ను పెళ్లి చేసుకోబోతున్నారని, అందుకే ఏ ప్రాజెక్టులు టేకప్ చేయలేదని వార్తలు వస్తున్నాయి. పద్మావత్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే ముంబైకి చెందిన మాఫియా క్వీన్ రహీమా ఖాన్ జీవితం ఆధారంగా ”సప్నా దీదీ” అనే సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. విశాల్ భరద్వాజ్ రూపొందిస్తున్న ఈ సినిమాలో దీపికాతో పాటు ఇర్ఫాన్ ఖాన్ కీలక పాత్రలో నటించనున్నారు.

ప్రస్తుతం ఇర్ఫాన్ అనారోగ్యంతో చికిత్స పొందుతున్నందున షూటింగ్ ప్రస్తుతం నిలిచిపోయింది. ఇర్ఫాన్ వచ్చే వరకు సినిమా స్టార్ట్ చేయడం కుదరదు కనుక దీపికాకు సమయం దొరికినట్లయింది. ఒకానొక సందర్భంలో తాను కామెడీ రోల్ చేయాలనుందని, అలాంటి మంచి పాత్రలు రావడం లేదని, బాలీవుడ్ లో పాత్రల కొరత ఉందని అన్నారట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!