గోపీచంద్‌కు సహాయపడుతున్న ప్రభాస్..!


తెలుగు ఇండస్ట్రీలో ప్రభాస్, గోపీచంద్ మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరూ వర్షం సినిమాలో కలిసి నటించారు. అందులో ప్రభాస్ హీరో.. గోపీచంద్ విలన్‌గా నటించారు. ఆ తర్వాత గోపీచంద్ హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు గోపీచంద్ హీరోగా జిల్ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో ప్రభాస్ నిర్మించాడు. లౌఖ్యం తర్వాత గోపీచంద్‌కు హిట్ లేదు. తాజాగా గోపీచంద్ హీరోగా నటించిన చాణక్య సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా రిలీజ్‌కు ముందు గోపీచంద్ నిర్మాత భోగవల్లి ప్రసాద్ నిర్మాణంలో కొత్త దర్శకుడితో ఒక సినిమాకు కమిట్ అయ్యారు. అయితే చాణక్య సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో అతనితో సినిమా ఆలోచన విరమించుకున్నాడని సమాచారం. ప్రస్తుతం గోపీచంద్ చేతిలో సంపత్ నంది సినిమా మాత్రమే ఉంది. మరోవైపు ప్రభాస్.. తన స్నేహితుడు గోపీచంద్
కెరీర్ నిలబెట్టడానికి ఇద్దరు ముగ్గురు బడా దర్శకులతో కథలను రెడీ చేయిస్తున్నట్టు సమాచారం.