HomeTelugu Newsవరుస చిత్రాలతో బాల్యయ బిజీ

వరుస చిత్రాలతో బాల్యయ బిజీ

ఎన్టీఆర్‌ “బయోపిక్‌” లో బాలకృష్ణ ఎన్టీఆర్‌ పాత్ర చేయవల్సిన సినిమా ఆగిపోవడంతో బాలకృష్ణ వరస సినిమాలకు సైన్‌ చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం వి వి వినాయక్‌ దర్శకత్వంలో ఒక చిత్రంలో నటించనున్నాడు. ఈ చిత్రం యొక్క పూజా కార్యక్రమాలు ఈ నెలలో నిర్వహించనున్నారు. ఈ సినిమాకి సి. కళ్యాణ్‌ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ మూవీలో హీరోయిన్‌గా శ్రియా శరణ్ ఎంపికైంది. బాలయ్య, వినాయక్‌ కాంబినేషన్‌కు తగ్గట్లుగానే ఈ చిత్రం మాస్‌, యాక్షన్‌ మూవీగా ఉండబోతుందట. ఈ సినిమాకి పరుచూరి బ్రదర్స్‌ మాటలు అందిస్తున్నారు.

1 5

ఈ చిత్రం తరువాత బాలయ్య లక్కీ డైరెక్టర్‌ బోయపాటితో కూడ మరో సినిమా చేయనున్నారట. ఇక ఈ రెండు చిత్రాల తరువాత పూరి జగన్నాధ్‌ కూడా బాలకృష్ణతో చేయాలని చూస్తున్నాడు. కథ కూడా వినిపించారని, ఇంకా ఈ సినిమాకి బాలయ్య ఓకే చేయలేదని సమాచారం. గతంలో పూరి, బాలయ్య కాంబినేషన్‌లో “పైసా వసూల్‌” చిత్రం వచ్చింది. ఈ మూవీ మాస్‌ ఎంటర్‌ టైనర్‌ గా నిలిచింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!