HomeTelugu Newsశ్రీదేవి నాకు చెల్లెలు లాంటిది: కమల్!

శ్రీదేవి నాకు చెల్లెలు లాంటిది: కమల్!

కమల్ హాసన్, శ్రీదేవి కలిసి ఎన్నో చిత్రాల్లో నటించారు. వీరిద్దరిది హిట్ పెయిర్.  ఎన్నో హిట్ చిత్రాల్లో వీరి కెమిస్ట్రీ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. అయితే వీరిద్దరి అనుబంధంపై రకరకాల రూమర్స్ తమిళనాట ప్రచారంలో ఉన్నాయి. తాజాగా.. కమల్ ఈ విషయంపై స్పందిస్తూ.. ఆ రోజుల్లో వెండితెరపై ఎలా కనపడితే అదే నిజం అనుకునేవారు. నిజ జీవితాల్లో కూడా అలాగే ఉంటామనుకునేవారు. మా ఇద్దరి పెయిర్ సూపర్ హిట్ కావటంతో జనం అలా మాట్లాడుకుని ఉండవచ్చు. నిజానికి శ్రీదేవి నాకు చెల్లెలు లాంటిది. నేను కూడా శ్రీదేవితో కలిసి ఆమె తల్లి చేతి ముద్దలు తిన్నా. నాకు శ్రీదేవి తోబుట్టువుతో సమానం.. దయచేసి వదంతులను సృష్టించవద్దు.

kamal1”శ్రీ‌దేవి యువ‌తిగా ఉన్న ద‌శ నుంచి అద్భుత‌మైన (ప‌రిపూర్ణ‌) మ‌హిళ‌గా మారిపోయిన ద‌శ వ‌ర‌కు ఆమె జీవితానికి నేను ఓ సాక్ష్యంలా నిలిచాను. ఆమె త‌న‌కు ద‌క్కిన స్టార్ డ‌మ్‌కు అన్ని విధాలా అర్హురాలు. త‌ను ప‌రిచ‌యం అయిన‌ప్ప‌టి నుంచి చివ‌ర‌గా మేమిద్ద‌రం ఎదురుప‌డిన సంద‌ర్భం వ‌ర‌కు ఎన్నో జ్ఞాప‌కాలు న‌న్ను ఫ్లాష్‌లా వెంటాడుతున్నాయి. ఇప్పుడైతే ‘స‌ద్మా’ (వ‌సంత కోకిల‌)లోని లాలి పాట వెంటాడుతోంది. మ‌న‌మంతా త‌న‌ని మిస్ అయ్యాం” అంటూ ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!