HomeTelugu Trending2025 Tollywood లో ఒక్క స్టార్ హీరో సినిమా కూడా లేదా?

2025 Tollywood లో ఒక్క స్టార్ హీరో సినిమా కూడా లేదా?

2025 Tollywood Dry Spell: Fans Left Waiting for Their Stars!
2025 Tollywood Dry Spell: Fans Left Waiting for Their Stars!

2025 Tollywood Movies:

టాలీవుడ్‌ లో ప్రస్తుతం ఒక కొత్త ట్రెండ్ కొనసాగుతోంది. పాన్ ఇండియా హవా పెరిగిన తర్వాత, చాలా మంది స్టార్ హీరోలు పెద్ద స్థాయిలో సినిమాలు చేయడంలో మునిగిపోయారు. కానీ ఈ కారణంగా వారు వరుసగా సినిమాలు విడుదల చేయలేకపోతున్నారు. ఎటువంటి గ్యాప్ లేకుండా ప్రతి ఏడాది ఓ సినిమా ఇస్తున్న నటుడు మాత్రం నాని ఒక్కరే!

2025లో చాలా మంది టాప్ హీరోలు అభిమానులను నిరాశపరుస్తున్నారు. ఈ ఏడాది ఎవరి సినిమాలు రావట్లేదో చూద్దాం:

మహేష్ బాబు: రాజమౌళితో చేస్తున్న భారీ ప్రాజెక్ట్‌కి కమిట్ అయిన మహేష్ బాబు, 2025లో ఎలాంటి రిలీజ్ లేకుండా ఉండబోతున్నారు. 2026లో కూడా ఈ సినిమానే ఉండే అవకాశం ఉంది. అంటే మహేష్ అభిమానులు ఇంకాస్త ఎక్కువగా ఆగాల్సిందే.

ఎన్టీఆర్: దసరా 2024లో విడుదలైన “దేవర” తర్వాత ఎన్టీఆర్‌కి తెలుగులో ఏ సినిమా లేదు. ఈ ఏడాది వార్ 2 అనే హిందీ డబ్బింగ్ సినిమా మాత్రమే ఉంది. ప్రషాంత్ నీల్ దర్శకత్వంలో “డ్రాగన్” చిత్ర షూటింగ్ మొదలైంది. అది మాత్రం 2026 జూన్‌లో విడుదల కానుంది.

ప్రభాస్: పలు సినిమాలు చేయబోతున్న ప్రభాస్‌కి స్పష్టత లేదు. “రాజా సాబ్”, “ఫౌజీ” సినిమాలు వాయిదా పడుతున్నాయి. ప్రస్తుత సమాచారం ప్రకారం 2025లో ప్రభాస్‌కి కూడా రిలీజ్ ఉండదు.

రామ్ చరణ్: “గేమ్ ఛేంజర్” డిజాస్టర్ తర్వాత, బుచ్చిబాబు సానాతో “పెడ్డి” అనే గ్రామీణ క్రీడల నేపథ్యంలో సినిమా చేస్తున్నారు. ఇది 2026 మార్చిలోనే రానుంది.

అల్లు అర్జున్: “పుష్ప 2” తో ఘన విజయాన్ని అందుకున్న ఆయన, అట్లీ దర్శకత్వంలో చేసే సినిమా పనులు ప్రారంభ దశలో ఉన్నాయి. షూటింగ్ అక్టోబర్‌లో మొదలవుతుంది. ఈ సినిమా 2027లోనే రానుంది.

ALSO READ: NC24 సినిమాలో Naga Chaitanya, Meenakshi Chaudhary ల పాత్రలు ఇవే..

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!