నందమూరి బ్రదర్స్ కు 80 కోట్ల లాభం..?

నందమూరి కల్యాణ్ రామ్ వరుస పరాజయాలతో నష్టాలు చవిచూసే సరికి అతడిని గాడిలో పెట్టడం కోసం ఎన్టీఆర్ మిగిలిన సినిమాలన్నీ పక్కన పెట్టి ‘జై లవకుశ’ సినిమా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో చేశాడు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఎలాంటి పారితోషికం తీసుకోలేదు. లాభాల్లో వాటా తీసుకుంటాడని తెలుస్తోంది. అయితే ఈ సినిమాను తక్కువ బడ్జెట్ లో పూర్తి చేయాలని ఎన్టీఆర్ సూచించాడు. మొత్తం కలుపుకొని సినిమాను 26 కోట్ల బడ్జెట్ లోపే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో సినిమాకు ఇంత తక్కువ బడ్జెట్ అంటే విశేషమే.

అయితే ఇప్పుడు ఈ సినిమాకు 80 కోట్ల వరకు బిజినెస్ జరుగుతోందని తెలుస్తోంది. అవి కాకుండా ఇతర రైట్స్ రూపంలో మరో ఇరవై కోట్లు వచ్చి చేరతాయి. అంటే మొత్తం పోనూ నందమూరి బ్రదర్స్ కు 80 కోట్ల వరకు లాభం అన్నమాట. మరి ఈ లాభాల్లో ఎన్టీఆర్ వాటా ఎంతనేది తెలియాల్సివుంది. మొత్తానికి నష్టాల్లో ఉన్న తన అన్నయ్యని ఒక్క సినిమాతో ఒడ్డున
పడేశాడు ఎన్టీఆర్.