సమంత వెబ్‌సిరీస్‌పై నిషేధం విధించాల‌న్న భార‌తీరాజా

స‌మంత న‌టించిన ‘ది ప్యామిలీ మెన్‌-2’ వెబ్‌ సిరీస్‌పై మళ్లీ వివాదాలు చెలరేగుతున్నాయి. వరుసగా విమర్శలు గుప్పిస్తున్నారు. తమిళనాడులోని పలువురు ప్రముఖులు సమంతపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. శ్రీలంకకు చెందిన తమిళ యువతిగా సమంత నెగెటివ్ రోల్‌లో నటించడంపై మండిపడుతున్నారు. ఈ వెబ్‌ సిరీస్‌ను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వానికి తమిళనాడు ప్రభుత్వం సహా పలు రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేశాయి. ఇప్పటికే ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్‌ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. తాజాగా ఈ అంశంపై సీనియర్ దర్శకుడు భారతీరాజా కూడా స్పందించారు. తమిళ జాతికి వ్యతిరేకంగా ‘ది ఫ్యామిలీ మెన్‌ 2’ వెబ్‌ సిరీస్ రూపొందింద‌ని, దాన్ని ప్రసారం చేయకూడద‌ని విజ్ఞప్తి చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ప‌ట్టించుకోకపోవ‌డం బాధాకరమని అన్నారు. ఈ వెబ్‌ సిరీస్‌ను తమిళ ద్రోహులు రూపొందించారని మండిపడ్డారు.

CLICK HERE!! For the aha Latest Updates