HomeTelugu NewsGaami : పెద్దవాళ్ళకు మాత్రమే!

Gaami : పెద్దవాళ్ళకు మాత్రమే!

 

A certificate for the movie
Gaami: విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం ‘గామి’. డిఫరెంట్‌ కన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయ. ఈ సినిమా నుండి విడుదలై అప్డేట్స్‌ అన్నీ కూడా మూవీపై ఓ రెంజ్‌లో హైప్‌ని క్రియేట్‌ చేశాయి. ఇక ఇటీవలే విడుదలైన ట్రైలర్‌ ప్రేక్షకులను వీపరితంగా ఆకట్టుకుంది. విజువల్స్ హాలీవుడ్‌ రేంజ్‌లో ఉన్నాయి అని నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.

విద్యాధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చ్‌8న ప్రేక్షకుల ముందుకు రానుంది. బడ్జెట్ కారణాల దృష్ట్యా ఈ మూవీకి విశ్వక్‌ సేన్‌.. రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదట. గామి సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయంలో చిత్ర యూనిట్ ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చింది. ఇందులో హీరో అఘోర పాత్రలో కనిపించబోతున్నాడు.

మానవ స్పర్శ అతనికి ఊహించని విధంగా ఇబ్బందులను కలిగిస్తూ ఉంటుంది. ఒక మానసిక సమస్యతో బాధపడుతున్న అతను హిమాలయాలకు ప్రయాణాన్ని సాగిస్తాడు. అక్కడే అతని సమస్యకు అసలు సమాధానం దొరుకుతుంది అని అనుకుంటాడు. దీంతో అతని ప్రయాణమే గామి సినిమాలో అసలు పాయింట్ అని ట్రైలర్ తో అర్ధమైపోయింది.

ఇక ఈ సినిమాకు తప్పకుండా సెన్సార్ నుంచి U/A సర్టిఫికెట్ వస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా A సర్టిఫికెట్ రావడం విశేషం. ఈ ట్రైలర్ లో అయితే మరి ఆ రేంజ్ లో సీన్స్ అయితే కనిపించలేదు. కానీ ఇప్పుడు సెన్సార్ నుంచి ఈ సినిమా కేవలం పెద్దలకు మాత్రమే అనే క్లారిటీ రావడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

అంతగా ఈ సినిమాలో పెద్దలు చూసే కంటెంట్ ఏముందా అనే ఆలోచన మరింత క్యూరియాసిటీని కలిగిస్తోంది. సినిమాలో ఒక తెలియని భావోద్వేగం అలాగే ఆలోచింపజేసే సన్నివేశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ విషయాలను ఎంత లోతుగా చెప్పారో వెండితెరపైనే చూడాలి. ఏ సర్టిఫికెట్ రావడంతో ఈ సినిమాపై మరింత అంచనాల పెరిగాయి. విశ్వక్‌ సేన్‌కు ఈ సినిమా ఎంతవరకూ ప్లస్‌ అవుతుందో చూడాలి. ఇక ఈ సినిమాలో చాందిని చౌదరి ముఖ్యమైన పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!