HomeTelugu Trendingదయచేసి నా సినిమాని బహిష్కరించకండి: ఆమీర్‌ ఖాన్‌

దయచేసి నా సినిమాని బహిష్కరించకండి: ఆమీర్‌ ఖాన్‌

Aamir khan about laal sing
బాలీవుడ్‌ హీరో ఆమిర్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’. ఈ నెల 11వ తేదీన విడుదల కానుంది. హాలీవుడ్ క్లాసిక్ ‘ఫారెస్ట్ గంప్’కి రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాలో కరీనా కపూర్ హీరోయిన్ గా నటించగా… అక్కినేని నాగచైతన్య ఓ కీలక పాత్ర పోషించాడు. ఈ చిత్రం ప్రమోషన్లలో ఆమిర్ బిజీగా ఉన్నాడు. మరోవైపు దేశంపై గతంలో ఆమిర్ చేసిన వ్యాఖ్యలను తెరపైకి తెచ్చి ‘లాల్ సింగ్ చడ్డా’ ను బహిష్కరించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

‘బాయ్ కాట్ లాల్ సింగ్ చడ్డా’ అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. దీనిపై తాజాగా ఆమిర్ ఓ ఈవెంట్‌లో స్పందించారు. తన సినిమాను బహిష్కరించవద్దని విజ్ఞప్తి చేశారు. ‘నా సినిమాలపై ఇలాంటి ప్రచారాలు జరగడం బాధాకరం. కొందరు నేను ఈ దేశాన్ని ఇష్టపడనని నమ్ముతున్నారు. అందుకు బాధ కలుగుతోంది. వాళ్ల మనసుకు అలా అనిపించి ఉండవచ్చు. కానీ అది అసత్యం. దయచేసి నా సినిమాని బహిష్కరించకండి. నా సినిమా చూడండి’ అని ఆమిర్ విజ్ఞప్తి చేశాడు.

ఆమిర్ ఖాన్‌.. 2015లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆ సదర్భంలో ఆమిర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘మన దేశం చాలా సహనంతో ఉంటుంది. కానీ ఇక్కడ చెడును వ్యాప్తి చేసే వ్యక్తులు ఉన్నారు’ అని కామెంట్ చేశారు. ఆమిర్ మాజీ భార్య కిరణ్ రావు కూడా తమ పిల్లల భద్రత కోసం ఈ దేశం విడిచి వెళ్లే ఆలోచనతో ఉన్నామని చెప్పి వార్తల్లో నిలిచారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!