నా ఫేవరేట్‌ నటుడు చిరంజీవిని కలిశాను: అమీర్‌ ఖాన్‌


బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌ అమీర్‌ ఖాన్‌.. మెగాస్టార్‌ చిరంజీవిని కలిశారు. జపాన్‌లోని క్యోటో ఎయిర్‌పోర్ట్‌లో తనకు చిరంజీవి ఎదురయ్యారంటూ ఆయనతో కలిసి దిగిన ఫొటోను అమీర్‌ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ‘నా ఫేవరేట్‌ నటుల్లో ఒకరైన చిరంజీవిని క్యోటో ఎయిర్‌పోర్ట్‌లో కలిశాను. వాట్‌ ఎ సర్‌ప్రైజ్‌. ఆయన నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా గురించి, స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి చిరుతో చర్చించాను. మీరు ఎప్పుడూ మాకు ఎంతో స్ఫూర్తిదాయకం సర్‌.. లవ్‌’ అని పేర్కొన్నారు.

సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రీకరణ ప్రస్తుతం జపాన్‌లో జరుగుతోంది. చిరు తన కుటుంబంతో అక్కడే విహారయాత్రను ఎంజాయ్‌ చేస్తున్నారు. సినిమా చివరి షెడ్యూల్‌ ఇదేనని టాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఇందులో చిరుకు జోడీగా నయనతార నటిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌, సుదీప్‌, తమన్నా, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై రామ్‌ చరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్‌ 15న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates