ఫ్లాప్ సినిమాకి సీక్వెల్ అవసరమా..?

ఈ మధ్య కాలంలో సౌత్ ఫిల్మ్స్ లో సీక్వెల్స్ హవా ఎక్కువవుతోంది. సినిమా హిట్ అయితే ఓకే.. కానీ ఫ్లాప్ సినిమాకు కూడా సీక్వెల్ తీయడం ఎంతవరకు కరెక్ట్. ఇప్పుడు అలాంటి సంఘటన జరగబోతోంది. గతంలో ప్రభుదేవా, తమన్నా, సోనూ సూద్ లు కలిసి ‘అభినేత్రి’ అనే సినిమాలో
నటించారు. కె.ఎల్.విజయ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు ప్రభుదేవా కూడా ఓ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా రిలీజ్ అయింది.

కానీ సినిమాకు ఊహించినంత స్పందన లభించలేదు. తమిళంలో ఏవరేజ్ టాక్ వచ్చినప్పటికీ తెలుగులో మాత్రం సినిమా ఫ్లాప్ అయింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.  ప్రీప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టేశారట. అయితే ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరనేది తెలియాల్సివుంది. మరి ఈసారి కూడా తమన్నానే నటిస్తుందా..? అనే విషయంలో క్లారిటీ రావాల్సివుంది. మరి ఫ్లాప్ సినిమాకు సీక్వెల్ అంటే ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో..?