HomeTelugu Trendingకుమార్తె ఫొటోలు షేర్‌ చేసిన నటి..

కుమార్తె ఫొటోలు షేర్‌ చేసిన నటి..

Actress sneha shares her da

హీరోయిన్‌ స్నేహ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఫామిలీ కథా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన స్నేహ.. శ్రీరామదాస్ లాంటి డీవోషనల్ మూవీలోను స్నేహ నటించింది. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో కథానాయకిగా రాణించారు స్నేహ. నటిగా ఫుల్‌ క్రేజ్‌లో వుండగానే నటుడు ప్రసన్నను ప్రేమించి, పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో రెండో సంతానంగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు స్నేహ. పాప పుట్టి ఏడు నెలలకు పైనే అవుతున్నా ఇంతవరకు చిన్నారి ఫోటోలు ఎక్కడా షేర్‌ చేయలేదు. ఈ క్రమంలో భర్త, నటడు ప్రసన్న 38వ పుట్టిన రోజు సందర్భంగా కుమార్తెను ప్రపంచానికి స్నేహ పరిచయం చేశారు. పాప పేరు ఆద్యంత. తల్లిదండ్రులు, అన్న విహాన్‌తో కలిసి ఉన్న చిన్నారి ఆద్యంత ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ భర్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు స్నేహ. ఈఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!