
Balakrishna-Vijayashanthi:
లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1980, 90 దశకాల్లో అగ్ర కథానాయికగా వెలుగొందిన ఆమె, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి స్టార్ హీరోలతో కలిసి అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఆమె ఎక్కువగా యాక్షన్, లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో మెరిశారు. చిరంజీవితో కలిసి ఆమె నటించిన సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి.
అయితే బాలకృష్ణతో విజయశాంతి అత్యధిక సినిమాల్లో నటించారు. వీరి కలయికలో దాదాపు 17 చిత్రాలు విడుదలై మంచి విజయాన్ని సాధించాయి. అప్పట్లో వీరి కెమిస్ట్రీ గురించి సినీ వర్గాల్లో చర్చలు జరిగాయి. బాలకృష్ణ, విజయశాంతి మధ్య సాన్నిహిత్యం ఉందనే పుకార్లు కూడా వినిపించాయి.
ఒక దశలో వీరి పెళ్లి వార్తలు గుప్పుమన్నాయి. కానీ విజయశాంతి ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తిని వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత బాలకృష్ణతో ఒక్క సినిమాకు కూడా ఒప్పుకోలేదు. దీనిపై అనేక ఊహాగానాలు వ్యాప్తి చెందాయి.
విజయశాంతి భర్త కొన్ని షరతులు విధించిన కారణంగా ఆమె బాలకృష్ణతో సినిమాలు చేయడం మానేశారనే పుకార్లు వచ్చాయి. అయితే ఆమె ఈ వార్తలను ఖండించారు. పెళ్లి తర్వాత హీరోలతో తక్కువ సినిమాలు చేయాలనే నిర్ణయంతోనే బాలకృష్ణతో నటించలేదు.
సినిమాలకు విరామం తీసుకున్న విజయశాంతి, రాజకీయాల్లోకి ప్రవేశించి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ‘రాములమ్మ’గా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని, వివిధ పార్టీల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు.
కొంత విరామం తర్వాత విజయశాంతి ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చి, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందారు. ఆమె బాలకృష్ణతో మరోసారి నటించే అవకాశముందా? అన్నదీ ఇప్పటికీ సినీ అభిమానుల ఆసక్తిగా మారింది.