తన పెళ్లి వివాదంపై క్లారీటీ ఇచ్చిన యంగ్‌ హీరో

క్షణం, గూఢచారి’ వంటి హిట్ సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు యంగ్‌ హీరో అడివి శేష్. ప్రస్తుతం ‘టు స్టేట్స్’ తెలుగు రీమేక్ తో పాటు ఇంకొన్ని ప్రాజెక్ట్స్ ఒప్పుకుని బిజీగా ఉన్నాడు. గత కొద్దిరోజులుగా శేష్ పెళ్లి త్వరలోనే జరగనుంది, అది కూడా పరిశ్రమలోని ఒక పెద్ద కుటుంబానికి చెందిన సెలబ్రిటీతో అని వార్తలొచ్చాయి.

శేష్ కూడా తన ట్విట్టర్ ద్వారా త్వరలోనే ఒక విషయం చెబుతాననడం ఆ వార్తలకి మరింత ఊపునిచ్చింది. చివరికి ఆ వార్త కాస్త హాట్ టాపిక్ అయింది. దీంతో శేష్ స్పందించి ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నానని, అంతకన్నా ఏమీ లేదని క్లారిటీ ఇచ్చాడు. దీంతో రూమర్లకి చెక్ పడింది.