HomeTelugu Trendingఅజిత్‌ కటౌట్‌ కుప్పకూలి.. గాయాలపాలైన ఫ్యాన్స్ !

అజిత్‌ కటౌట్‌ కుప్పకూలి.. గాయాలపాలైన ఫ్యాన్స్ !

8 8తమిళనాడులో ప్రముఖ హీరో అజిత్‌ నటించిన ‘విశ్వాసం’. ఈ సినిమా విడుదల సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. తిరుకొవిళూర్‌లో అజిత్‌ కటౌట్‌కు అభిమానులు పాలాభిషేకం చేస్తుండగా కటౌట్‌ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. భారీ కటౌట్‌ ఏర్పాటు చేయడం, ఒకేసారి ఎక్కువ మంది అభిమానులు కటౌట్‌పైకి ఎక్కి పాలాభిషేకం చేసేందుకు ప్రయత్నించడంతో ప్రమాదం చోటు చేసుకుంది. అజిత్‌, నయనతార జంటగా నటించిన విశ్వాస్‌ సినిమా విడుదల సందర్భంగా తమిళనాడు వ్యాప్తంగా ఆయన అభిమానులు కటౌట్లు ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!