సిక్స్‌ ప్యాక్‌ తో అఖిల్‌..!

యంగ్‌ హీరో అఖిల్ అక్కినేని సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు అందుబాటులో ఉంటాడు. ఎప్పటికప్పుడు తన గురించే తన సినిమాల గురించి అప్డేట్స్ ఇస్తూ ఉండే అఖిల్ తాజాగా తన ఇన్స్టాగ్రమ్ లో సిక్స్ ప్యాక్ బాడీతో ఉన్న ఫోటో ఒకదాన్ని అప్లోడ్ చేశారు.

ప్రేక్షకుల నుండి ఈ ఫోటోకు విపరీతమైన స్పందన లభిస్తోంది. రాబోయే ‘మిస్టర్ మజ్ను’ చిత్రంలో అఖిల్ సిక్స్ ప్యాక్ ప్రదర్శనం ఉంటుందని అంతా భావిస్తున్నారు. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. ఇందులో అఖిల్ కు జోడీగా నిధి అగర్వాల్ నటించడం జరిగింది. కాగా ఈ చిత్రంలో కాజల్‌ అగార్వల్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు.