సోషల్‌ మీడియాలో 2 పాయింట్‌ 0 అక్షయ్‌ గెటప్‌ లింక్‌

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వస్తోన్న ‘2 పాయింట్‌ 0’ దేశవ్యాప్తంగా ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. బుకింగ్స్‌ ఓపెన్‌ అయిన వెంటనే టికెట్స్‌ అయిపోవడంపై సోషల్‌ మీడియాలో వస్తోన్న మేమ్స్‌ చూస్తుంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. ఇప్పటికే పెట్టిన బడ్జెట్‌లో సగానికిపైన రాబట్టేసిందని సమాచారం.

ఇంతలా సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోన్న ఈ చిత్రంలో అక్షయ్‌కుమార్‌ వేసిన గెటప్‌కు విపరీతమైన హైప్‌ క్రియేట్‌ అయింది. అక్షయ్‌ ఆ గెటప్‌ను ధరించడానికి ఎంత కష్టపడ్డాడో కూడా మేకర్స్‌ వీడియోను రిలీజ్‌ చేశారు. అయితే ఆ గెటప్‌లోకి రావడానికి అక్షయ్‌ పడినంత కష్టం మనం పడనక్కర్లేదు.. కానీ అక్షయ్‌ సోషల్‌మీడియాలో షేర్‌చేసిన లింక్‌ను క్లిక్‌ చేస్తే మనం కూడా ఆ గెటప్‌లోకి మారొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓసారి ట్రై చేయండి. అమీజాక్సన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతాన్ని అందించారు. ఈ మూవీ నవంబర్‌ 29న విడుదలకానుంది.