HomeTelugu Trendingలక్ష్మీగా అక్షయ్‌ ఫస్ట్‌లుక్‌

లక్ష్మీగా అక్షయ్‌ ఫస్ట్‌లుక్‌

5 2‘కాంచన’ మూవీ.. హిందీలో రీమేక్‌ అవుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ ఖిలాడీ అక్షయ్‌ కుమార్‌ హీరోగా లారెన్స్‌ దర్శకత్వంలో ‘లక్ష్మీ బాంబ్‌’ గా రీమేక్‌ చేస్తున్నారు. నవరాత్రి వేడుకల సందర్భంగా ‘లక్ష్మీ’గా అక్షయ్‌కుమార్‌ లుక్‌ను తాజాగా విడుదల చేశారు. హీరో అక్షయ్‌ తోపాటు డైరెక్టర్‌ లారెన్స్‌ తమ సోషల్‌ మీడియా అకౌంట్లలో ఈ మేరకు ఫొటోలను పోస్టు చేశారు.

సౌత్‌లో లారెన్స్‌ పోషించిన కాంచన పాత్రను.. అక్షయ్‌ హిందీలో పోషిస్తున్నారు. అక్షయ్‌ తొలిసారి ఈ సినిమాలో ట్రాన్స్‌జెండర్‌ పాత్రను పోషిస్తున్నారు. ట్రాన్స్‌జెండర్‌ లక్ష్మీగా ఈ ఫొటోలో అక్షయ్‌ తీక్షణమైన చూపుతో గంభీరంగా, ఒకింత భయం గొలిపేలా కనిపిస్తున్నారని నెటిజన్లు ఈ ఫొటోపై కామెంట్‌ చేస్తున్నారు. ఇక, ‘లక్ష్మీ’గా ట్రాన్స్‌జెండర్‌ పాత్ర విషయంలో తాను ఎక్సైటింగ్‌తోపాటు నెర్వస్‌గా కూడా ఉన్నానని, ఎంతైనా కంఫర్ట్‌ జోన్‌ను దాటి రావడమే జీవితమని అక్షయ్‌ అభిప్రాయపడ్డారు.

‘లక్ష్మీ బాంబ్‌’ దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన లారెన్స్‌.. తిరిగి అక్షయ్‌ నచ్చజెప్పడంతో ఈ సినిమాను టేకప్‌ చేసిన సంగతి తెలిసిందే. గతంలో తనకు తెలియకుండా ఈ సినిమాకు సంబంధించిన అక్షయ్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడంతో లారెన్స్‌ అలిగిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో అక్షయ్‌ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!