HomeTelugu Trendingలాక్‌డౌన్ లో తొలిసారిగా షూటింగ్ చేసిన హీరో!

లాక్‌డౌన్ లో తొలిసారిగా షూటింగ్ చేసిన హీరో!

4a 1
కరోనా వైరస్‌ వ్యాప్తిని ఆరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో అన్ని రంగాల కార్య కలాపాలను స్తంభించిపోయాయి. సినిమా చిత్ర నిర్మాణం కూడా గత రెండు నెలలుగా ఎక్కడివి అక్కడ నిలిచిపోయాయి. ఈ క్రమంలో దేశంలో తొలిసారిగా ఇప్పుడు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మేకప్ వేసుకుని కెమెరా ముందుకు వచ్చాడు. అయితే, ఇదేదో సినిమా షూటింగ్ కోసం మాత్రం కాదులెండి.. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమమైన ‘ఆయుష్మాన్ భారత్’ ప్రచారానికి సంబంధించిన వాణిజ్య ప్రకటన షూట్ కోసం కెమెరా ముందుకొచ్చాడు!

ప్రముఖ దర్శకుడు ఆర్. బాల్కి దర్శకత్వంలో ఈ వాణిజ్య ప్రకటన చిత్రాన్ని తాజాగా ముంబైలోని కమలిస్తాన్ స్టూడియోలో చిత్రీకరించారు. సుమారు రెండు గంటల పాటు ఈ చిత్రీకరణ జరిగింది. ఇందుకోసం ముంబై పోలీస్ కమీషనర్ నుంచి అనుమతి తీసుకున్నారు. అలాగే షూటింగు స్పాట్‌ లో భౌతిక దూరం పాటించడం వంటి అన్ని ముందు జాగ్రత్తలను తీసుకుని, ప్రభుత్వ నిబంధనలను పాటించారు. ఈ విధంగా కరోనా వైరస్ లాక్‌డౌన్ సమయంలో తొలిసారిగా షూటింగ్ చేసిన ఘనత అక్షయ్ కుమార్ కే దక్కింది!

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!