HomeTelugu Big Storiesబిగ్‌బాస్‌-5లో అలీ!

బిగ్‌బాస్‌-5లో అలీ!

Ali in Bigg boss 5 telugu

తెలుగు బిగ్ బాస్-5 త్వరలో ప్రారంభం కానుంది. ఆగస్ట్ రెండో వారం నుంచి ప్రారంభించాలిని నిర్వాహకులు ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ సీజన్‌లో ఎవరెవరు పాల్గొనబోతున్నారు అనేది వైరల్‌ గా మారింది. ముఖ్యంగా యూ ట్యూబ్ సెన్సేషన్ షణ్ముఖ్ జస్వంత్ సహా మరో 10 మంది పేర్లు కూడా బాగానే వినిపిస్తున్నాయి. ఈ సారి స్టార్ క్యాస్టింగ్ కూడా బాగానే కనిపిస్తుంది. చాలా మంది కాంట్రవర్సీ పర్సన్స్ నే ఈ సారి షోలోకి పిలుస్తున్నట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే సురేఖా వాణి లాంటి సీనియర్ నటీమణులను కూడా బిగ్‌బాస్ లోకి ఆహ్వానిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.

వీళ్ళతో పాటు ఈ సారి టాలీవుడ్‌ నటుడు, కమెడియన్ అలీ రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు ప్రేక్షకులతో ఎంతో అనుబంధం ఉన్న అలీని ఈ షోకి తీసుకొస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలు చేస్తున్నారు నిర్వాహకులు. కచ్చితంగా అలీ వస్తే షో రేంజ్ కూడా పెరుగుతుందని.. ఆయన లాంటి ఓ లెజెండరీ కమెడియన్ ఇంట్లోకి వెళ్తే టిఆర్పీ కూడా భారీగానే పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అందుకే ఎలాగైనా సరే అలీని ఒప్పించాలని కంకణం కట్టుకున్నారు స్టార్ మా యాజమాన్యం. దీనికోసం అలీకి భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేస్తున్నారు.

Ali

ఈ మధ్య అలీ ఎక్కువగా సినిమాల్లో కనిపించడం లేదు. బుల్లితెరపైనే బిజీ అవుతున్నాడు. ఓ వైపు అలీతో సరదాగా లాంటి షోలు చేస్తూ.. యమలీల సీరియల్ చేస్తున్నాడు. వీటికి కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చి బిగ్ బాస్ లోకి రావాలంటూ ఈయనకు ఆహ్వానం పలుకుతుంది స్టార్ మా. దానికోసం ఊహించని పారితోషికం కూడా ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి దీనికి అలీ ఒప్పుకుంటాడా..అనేది ఆసక్తికరంగా మారింది. ఒక వేళ అలీ బిగ్‌బాస్‌కి వస్తే.. ఈ షో మరో రెంజ్‌లో ఉంటుంది అని నెటిజన్లు అంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!