HomeTelugu Newsరణ్‌బీర్‌ ఇంటికి దగ్గరగా.. ఆలియా న్యూ ఫ్లాట్లు ఖరీదు ఎంతో తెలుసా!

రణ్‌బీర్‌ ఇంటికి దగ్గరగా.. ఆలియా న్యూ ఫ్లాట్లు ఖరీదు ఎంతో తెలుసా!

12 18బాలీవుడ్‌ హీరోయిన్‌ ఆలియా భట్ వరుస విజయాలతో రాణిస్తున్నారు. ఇప్పటికే ఆమె ముంబయిలో రెండు ఫ్లాట్లు కొన్నారు. ఇప్పుడు జుహూలోని రణ్‌బీర్‌ కపూర్‌ ఇంటికి సమీపంలో మరో ఫ్లాట్‌ను ‌కొన్నారట. రెట్టింపు మొత్తం చెల్లించి ఆమె ఈ ఫ్లాట్‌ను తీసుకున్నట్లు చెబుతున్నారు. ఫస్ట్‌ ఫ్లోర్‌లో 2300 అడుగులున్న ఈ ఇంటి‌ విలువ రూ.7.8 కోట్లట. కానీ ప్రీమియం, రిజిస్ట్రేషన్‌కు‌ మొత్తం కలిపి రూ.13.11 కోట్లు ఖర్చు అయిందని తెలుస్తోంది. జనవరి 9న అంధేరిలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఆలియా ఫ్లాట్‌ను రిజిస్టర్ చేయించినట్లు సమాచారం. రణ్‌బీర్‌‌ ఇంటికి దగ్గరగా ఉండాలనే ఆమె ఈ ఇల్లు కొన్నట్లు చెబుతున్నారు.

ఆలియా, రణ్‌బీర్‌ ప్రేమలో ఉన్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై రణ్‌బీర్‌ కూడా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. అందరితో తన బంధం వేరు, ఆలియాతో వేరంటూ ఆమెపై ఉన్న ప్రేమను పరోక్షంగా చెప్పారు. రణ్‌బీర్‌ అంటే తనకు చిన్నప్పటి నుంచీ ఇష్టమని ఆలియా ఇటీవల ఓ సందర్భంలో అన్నారు. వీరిద్దరికీ పెళ్లి చేయాలని ఇరు కుటుంబ సభ్యులు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికితోడు ఆలియా, రణ్‌బీర్‌ ముంబయిలో అప్పుడప్పుడూ జంటగా దర్శనమిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!