సోనాక్షి సిన్హా అరెస్ట్‌పై అలహాబాద్ హైకోర్టు స్టే

అలహాబాద్‌లోని మొరాబాద్‌కు చెందిన ఓ ఆర్గనైజర్ గత నెలలో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హాపై క్రిమినల్ కేసును దాఖలు చేసిన విషయం తెలిసిందే. నవంబర్ 24న సోనాక్షి సిన్హాపై చీటింగ్‌ కేసులో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అయితే సోనాక్షి సిన్హా అరెస్ట్‌ వారెంట్‌పై అలహాబాద్ హైకోర్టు స్టే ఇచ్చింది. దీనిపై విచారించిన హైకోర్టు కేసు దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో ఎలాంటి వేధింపులకు, ఇబ్బందులకు గురిచెయ్యవద్దనే ఉద్దేశంతోనే స్టే విధిస్తున్నామని అలహాబాద్ హైకోర్టు వివరించింది.

సెప్టెంబర్‌ 30న ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సోనాక్షి రూ. 37 లక్షలు తీసుకున్నారని, చివరి నిమిషంలో ఈవెంట్‌కు ఆమె హాజరుకాలేదని ఆరోపిస్తూ ప్రమోద్ శర్మ అనే ఆర్గనైజర్ ఫిర్యాదు చేశారు. ఆమె రాకపోవడంతో తనకు భారీఎత్తున నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసుని విచారించిన న్యాయముర్తి ఆమె అరెస్ట్‌పై స్టే విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కేసులో సోనాక్షి సహా ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

CLICK HERE!! For the aha Latest Updates