పుట్టినరోజు కానుకగా ‘బంగారు బుల్లోడు’ న్యూ పోస్టర్‌

నటుడు అల్లరి నరేష్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘బంగారు బుల్లోడు’. ఇవాళ నరేష్ పుట్టినరోజును పురస్కరించుకుని చిత్రబృందం సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన పోస్టర్‌ను విడుదల చేసింది. నరేష్ మాస్‌గా తయారై స్టైల్‌గా నడుచుకుంటూ వస్తున్నట్లుగా పోస్టర్‌లో చూపించారు. ఉగాదికి సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. పి.వి గిరి దర్శకత్వం వహిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై అనిల్‌ సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా ఝవేరీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఏప్రిల్‌లో విడుదలైన ‘మహర్షి’ చిత్రంలో నరేష్‌కు మంచి పాత్ర దక్కింది.