
Theatre Strike in Tollywood:
టాలీవుడ్‌లో థియేటర్ స్ట్రైక్‌పై హీట్ పెరుగుతోంది. పవన్ కళ్యాణ్ స్టేట్‌మెంట్ వచ్చిన తర్వాత ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ నేపథ్యంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మీడియా ముందుకొచ్చారు. తన మీద వస్తున్న ఆరోపణలకు క్లారిటీ ఇచ్చారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ – “గత కొన్ని సంవత్సరాలుగా ‘ఆ నాలుగురు’ అనే చర్చ జరుగుతోంది. అందులో నేను లేను. నాకు ఆ బిజినెస్‌తో సంబంధం లేదు. కొవిడ్ తర్వాత థియేటర్ లీజుల నుంచి పూర్తిగా తప్పుకున్నాను. తెలంగాణలో AAA సినిమాస్ తప్ప ఇంకో థియేటర్ కూడా నా లీజ్‌లో లేదు. ఏపీ లో ఎక్కువ థియేటర్లు వదిలేశాను. మొత్తం 1500 థియేటర్లు ఉన్నా, నాకు లీజ్‌లో ఉన్నవి 15కి కూడా తక్కువే. వాటినీ మళ్లీ రిన్యూ చేయట్లేదు. అలవాటుతో నా పేరు వేసి ఉంటారు. కానీ నేను ఆ బిజినెస్‌లో లేను’’ అన్నారు.
ఇంకా మాట్లాడుతూ – “నేను 50 ఏళ్లుగా ప్రొడ్యూసర్‌గానే ఉన్నాను. థియేటర్ స్ట్రైక్ గురించి ఇటీవల జరిగిన మూడు మీటింగ్స్‌లో ఒక్కటికి కూడా హాజరుకాలేదు. నా అనుచరులెవరూ కూడా ఆ మీటింగ్స్‌కు వెళ్లలేదు. థియేటర్లు ఇబ్బందుల్లో ఉన్నాయనేది నిజమే. కానీ వాళ్లు ఫిల్మ్ చాంబర్, గిల్డ్ వంటి సంస్థలను సంప్రదించి పరిష్కారం వెతకాలి. ఇలా ఒక్కసారిగా మూసేయడం తగదు” అన్నారు.
పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీర మల్లు త్వరలో విడుదలకానుంది. అటువంటి సమయంలో థియేటర్లు మూయడం మంచి పని కాదని అరవింద్ చెప్పారు. “పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం అశ్వినిదత్ సినిమా రిలీజ్కి ముందు మేము పవన్ కలిశాం. అప్పుడు ఆయన ‘ఫిల్మ్ చాంబర్’ తరఫున చంద్రబాబును కలవాలని అడిగాడు. కానీ ఆ తర్వాత ఎవ్వరూ ముందడుగు వేయలేదు. ప్రభుత్వ సహకారం లేకుండా ఏ ప్రైవేట్ బిజినెస్ సజావుగా నడవదు. పవన్ స్టేట్‌మెంట్ చాలా క్లియర్‌గా, కరెక్ట్‌గా ఉంది” అన్నారు.
ALSO READ: Prabhas’ Spirit Latest Update: Smart Move or Risky Gamble?











