500 కోట్ల బడ్జెట్ తో రామాయణం!

బాహుబలి సినిమా సక్సెస్ తో తెలుగు సినిమాకు మార్కెట్ పెరిగింది. చాలా మంది దర్శకనిర్మాతలు భారీ బడ్జెట్ తో సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ నేపధ్యంలో అల్లు అరవింద్ కూడా 500 కోట్ల బడ్జెట్ తో సినిమా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనికోసం ఈ నిర్మాత రామాయణాన్ని ఎన్నుకున్నట్లుగా తెలుస్తోంది.  500 కోట్ల బడ్జెట్ అంటే దానికి లాభాలు రావడానికి మార్కెటింగ్ వ్యూహాలు, టైమింగ్ చాలా ముఖ్యం. అల్లు అరవింద్ వాటిలో నిష్ణాతుడు. ఆ కారణంగానే ధైర్యంగా ముందుకు వెళ్లడానికి నిర్ణయించుకున్నారట.
రామాయణాన్ని మూడు భాగాలుగా తెరకెక్కించనున్నారు. అల్లు అరవింద్ తో పాటు ప్రైమ్ ఫోకస్ నమిత్ మల్హోత్రా, మధు మంతెన కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగం కానున్నారు. తెలుగు, తమిళం, హిందీ వంటి మూడు ప్రధాన భాషల్లో ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ లో మొదలుపెట్టనున్నారు. ఈ సినిమాకు దర్శకుడు, నటీనటులు ఎవరనే విషయాలు తెలియాల్సివుంది!