హన్సికపై కోపంతో ఉన్న హీరోయిన్లు!

అందాల తార హన్సిక ప్రస్తుతం తమిళ ప్రాజెక్ట్స్ తో బిజీగా గడుపుతోంది. ఈ రెండేళ్లలో ఆమె ఒక్క తెలుగు సినిమా కూడా అంగీకరించలేదు. రీసెంట్ గా ‘లక్కున్నోడు’ సినిమాలో కనిపించింది. ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో అమ్మడుకి పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే మొన్నామధ్య హన్సికను లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో నటిస్తారా..? అని ప్రశ్నించగా నేను ఇంకా యంగ్ అమ్మాయినే.. నా వయసు కూడా పాతిక ఏళ్ళే.. ఇప్పుడే బరువైన పాత్రలు చేయలేనని చెప్పేసింది. నయనతార, త్రిష మాదిరిగా ముప్పై ఏళ్ళు దాటిన తరువాత ఆ తరహా పాత్రల గురించి ఆలోచిస్తా.. అంటూ సింపుల్ గా చెప్పింది.

ఇప్పుడు ఆమె మాటలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ విషయం నయన్, త్రిష ల వరకు వెళ్ళడంతో అమ్మడు చెప్పిన సమాధానంపై ఆ ఇద్దరు హీరోయిన్స్ గుర్రుగా ఉన్నారట. నిజమే ఇష్టం లేకపోతే చేయనని చెప్పాలి కానీ ఇలా వేరే హీరోయిన్స్ తో పోల్చడం ఎంతవరకు కరెక్ట్. పైగా వారిద్దరు ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నారు కూడా.. అది తెలిసి కూడా హన్సిక ఇలా కామెంట్ చేయడం వెనుక ఆమె ఉద్దేశం ఏంటో..? అంటూ కోలీవుడ్ లో చర్చించుకుంటున్నారు.