స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబందించిన ఓ వార్త బయటకు వచ్చింది. బన్నీ ఈ సినిమాలో విద్యార్థి నాయకుడిగా కనిపించబోతున్నాడట. అంటే ఈ సారి కొరటాల చూపు విద్యార్థి రాజకీయాలపై పడిందన్నమాట. ఒకవేళ అన్నీ అనుకున్నట్లు జరిగితే… బన్నీని విద్యార్థి నాయకుడిగా చూస్తాం. ఈ ఏడాది మొదట్లో ‘అల వైకుంఠపురములో’తో భారీ విజయం అందుకున్న బన్నీ… ఆ విజయాన్ని ఎంజాయ్ చేస్తుండగానే లాక్‌డౌన్ వచ్చేసింది. దీంతో ఇప్పుడు ఇంట్లోనే ఉంటూ కొత్త కథలు వింటున్నాడు. కాగా ప్రస్తుతం.. ‘పుష్ప’ పనులు మొదలు పెట్టాల్సి ఉంది. కరోనా ప్రభావం తగ్గాక ఆ సినిమా పూర్తి చేసి… కొరటాల సినిమా సెట్‌లోకి ప్రవేశిస్తాడని తెలుస్తోంది. ఇక చిరంజీవితో ‘ఆచార్య’ చేస్తున్నాడు.













