HomeTelugu Big Storiesఇది నా సొంత మనుషుల అవార్డ్!

ఇది నా సొంత మనుషుల అవార్డ్!

కీర్తిశేషులు అల్లు అరవింద్ గారి పేరు మీద ఏర్పాటు చేసిన శ్రీ అల్లు ఆర్ట్స్ అకాడమీ తరఫున జీవిత పురస్కారాన్ని దర్శకరత్న దాసరి నారాయరావుకి ఆయన పుట్టినరోజు సంధర్భంగా గురువారం హైదరాబాద్ లో చిరంజీవి, అల్లు అరవింద్ లు కలిసి అందించారు. ఈ సంధర్భంగా.. 
దాసరి నారాయణరావు మాట్లాడుతూ.. ”ఈ అవార్డ్ వేదిక మీద తీసుకోవాల్సింది కానే అనారోగ్య కారణంగా వెళ్లలేకపోయాను. నా తరఫున చిరంజీవి ఈ అవార్డ్ ను తీసుకొని నా పుట్టినరోజు సంధర్భంగా నాకు అందించారు. ఈ అవార్డ్ కు ఓ ప్రత్యేకత ఉంది.. ఇది నా సొంత మనుషుల అవార్డ్. రామలింగయ్య గారితో ఉన్న నా అనుబంధం అందరికీ తెలుసు. బహుశా నా దగ్గర చేసినన్ని సినిమాలు ఆయన మరో దర్శకుడితో సినిమా చేయలేదు. ఇండస్ట్రీలో కొందరికి ఆల్టర్నేటివ్ మరొకరు ఉండరు. వారిలో రామలింగయ్య గారు ఒకరు. ఆయన పేరు మీద జాతీయ అవార్డ్ పెట్టడం.. నాకు ఆ అవార్డ్ ను అందించడం సంతోషంగా ఉంది. నేను నోరు విప్పి నాలుగు నెలలు పైనే అవుతుంది. కానీ ఈ అవార్డ్ కోసం నోరు విప్పాను” అన్నారు. 
 
చిరంజీవి మాట్లాడుతూ.. ”చాలా కాలం అస్వస్థతకు గురై తిరిగి కోలుకొని రెట్టించిన ఉత్సాహంతో ఈ పుట్టినరోజు వేడుక జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన హాస్పిటల్ లో ట్రీట్మెంట్ లో ఉన్నప్పుడు నేను వెళ్ళి కలిసినప్పుడు ఖైదీ నెంబర్ 150 సినిమా ఎలా ఆడుతుందని మొదట అడిగారు. అప్పుడు కూడా ఆయన సినిమా గురించి మాట్లాడడం నన్ను కదిలించింది. దాసరి గారు ఈ ఇండస్ట్రీకు వెన్నెముకగా ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. అల్లు రామలింగయ్య గారి పేరు మీద ఏర్పాటు చేసిన శ్రీ అల్లు ఆర్ట్స్ అకాడమీ తరఫున దాసరి గారికి జీవిత పురస్కారం అందజేయడం సంతోషంగా ఉంది” అన్నారు. 
ఇంకా ఈ కార్యక్రమంలో మోహన్ బాబు, అల్లు అరవింది పాల్గొన్నారు. 

Recent Articles English

Gallery

Recent Articles Telugu