అల్లు శిరీష్ ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో’!

ఇటీవల ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాతో సక్సెస్ అందుకున్న అల్లు శిరీష్.. వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యారు. సైంటిఫిక్ థ్రిల్లర్ నేపధ్యంలో ఈ సినిమా సాగుతుందని సమాచారం. ఈ సినిమాకు ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వి.ఐ.ఆనంద్ తమిళ దర్శకుడైనా.. తన గత చిత్రానికి ‘ఎక్కడకి పోతావు చిన్నవాడా’ అనే పాత సినిమాలో పాటను టైటిల్ గా పెట్టుకున్నారు. ఇప్పుడు అల్లు శిరీష్ సినిమాకు కూడా అదే మాదిరి పాత సినిమాలో పాటను ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తోంది. 
అయితే కేవలం మంచి టైటిల్ పెట్టాలని కాకుండా.. కథకు టైటిల్ కు లింక్ అయ్యే విధంగా ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో’ అనే టైటిల్ రిజిస్టర్ చేయబోతున్నారని సమాచారం. ఈ సినిమా అల్లు శిరీష్ సరసన సురభి, సీరత్ కపూర్ ను జంటగా కనిపించనున్నారు. సినిమా షూటింగ్ ఇప్పటికి యాభై శాతం పూర్తయినట్లు తెలుస్తోంది. మరో రెండు, మూడు నెలల్లో షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి ఈ ఏడాది చివర్లో సినిమాను తెరపైకి తీసుకురావాలని చూస్తున్నారు. మరి ఈ సినిమా శిరీష్ కు ఎలాంటి సక్సెస్ ను ఇస్తుందో.. చూడాలి!