దుర్వాస మహర్షిగా మెహన్‌ బాబు.. ఫస్ట్‌లుక్‌ విడుదల

స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం `శాకుంతలం`. గుణశేఖర్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో దేవ్‌ మోహన్‌, మోహన్‌బాబు, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరితోపాటు అల్లు అర్జున్‌ కూతురు అల్లు అర్హ బాలనటిగా కనిపించబోతుంది. ఈ సినిమా విడుదలకు రెడీ అవుతుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ షూరూ చేశారు మేకర్స్‌. తాజాగా కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు.

మోహన్‌బాబు ఈ చిత్రంలో దుర్వాస మహర్షి పాత్రలో నటిస్తున్నారు. మహర్షిగా ఆయన లుక్‌ ఆకట్టుకుంటుంది. ఈ పాత్ర కీలకంగా ఉండబోతుంది. అత్రి మహర్షి, అనసూయల కుమారుడు దుర్వాస మహర్షి. పురాణాల ప్రకారం ఆయన అత్యంత కోపిష్టిగా ప్రసిద్ధి. అలాంటి ముక్కోపి అయిన దుర్వాస మహర్షి కోపానికి శకుంతల గురవుతుంది. మరి శకుంతలపై మహర్షి కోపానికి కారణమేంటి? ఆ శాపానికి విముక్తి ఏంటి? ఆయన పాత్ర ఎలాంటి మలుపులు తిప్పిందనేది `శాకుంతలం` చిత్రంలో ముఖ్య భాగంగా ఉండబోతుంది. ఇదే సినిమాకి కీలకం కాబోతుందని సమాచారం.

ఈసినిమాని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, గుణా టీమ్‌ వర్క్ పతాకాలపై దిల్‌రాజు, నిలిమా గుణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందిన ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన టీజర్‌, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. దీంతో సినిమాపై ఆసక్తినెలకొంది. ఏప్రిల్‌ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Image

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

CLICK HERE!! For the aha Latest Updates