
యాంకర్, నటి అనసూయ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనసరం లేదు. తన డ్రెస్సింగ్ విషయంలో తరచుగా నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటుంటుంది. తాజాగా మరోసారి ఆమెకు అలాంటి అనుభవమే మరోసారి ఎదురైంది. గతంలో అనసూయ వేసుకున్న ఒక పొట్టి డ్రస్సుపై ఓ నెటిజన్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. ఇద్దరు పిల్లల తల్లి అయిన మీరు, ఇలాంటి పొట్టి దుస్తులు ధరిస్తూ, తెలుగు ఆడపడుచుల పరువు తీస్తున్నారని విమర్శించాడు. ఈ వ్యాఖ్యలపై అనసూయ ఘాటుగా స్పందించింది. ‘దయచేసి మీరు మీ పనిని చూసుకోండి. నన్ను నా పనిని చేసుకోనివ్వండి. మీరు ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది.
సినీ దర్శకుడు సుకుమార్‌తో ఫొటోలు దిగి పోస్ట్ చేశారు
దయచేసి మీరు మీ పనిని చూసుకోండి నన్ను నా పనిని చేసుకోనివ్వండి.. మీరు ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారు 🙏🏻🙂 https://t.co/Uy4P00bmAE
— Anasuya Bharadwaj (@anusuyakhasba) April 4, 2022













