HomeTelugu Big Storiesదేవరకొండ ఫేవరెట్‌ యాంకర్‌ ఆమెనట!

దేవరకొండ ఫేవరెట్‌ యాంకర్‌ ఆమెనట!

9

టాలీవుడ్‌లో ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో విజయ్ దేవరకొండ చేసిన రచ్చకు యూత్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా ప్రమోషన్‌లో కూడా వెరైటీ కాన్సెప్ట్‌తో ముందుకు సాగింది ఆ టీమ్ బృందం. ఆ సినిమా విడుదలై ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో వేరే చెప్పక్కర్లేదు. డైలాగులు, యాక్షన్, కిస్ సీన్లు, భావోద్వేగ సన్నివేశాలు.. ఇలా ప్రతీదీ సూపర్ డూపర్. ఆ సినిమాతోనే తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. అన్ని ఇండస్ట్రీల్లో విజయ్ దేవరకొండ పేరు మార్మోగిపోయింది. ఆ సినిమాను హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేశారంటేనే అర్థం చేసుకోవచ్చు.. ఆ సినిమా ఏ స్థాయిలో రచ్చ చేసిందో. విజయ్ దేవరకొండకు ఆ సినిమా ఎంత స్టార్‌డమ్ తెచ్చిపెట్టిందో, ఓ ఇంటర్వ్యూ కూడా ఆ స్టార్‌డమ్‌ను మరింత పెంచేసింది. ఇంతకీ ఆ ఇంటర్వ్యూ ఎవరు చేశారంటే.. దేవీ నాగవళ్లి.

ఓ ప్రముఖ ఛానల్‌లో పనిచేస్తున్న ఆమె అర్జున్ రెడ్డి సినిమా విడుదలయ్యాక విజయ్ దేవరకొండను ఇంటర్య్వూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో ఆమె కొన్ని సూటి ప్రశ్నలు సంధించారు. ఆ ప్రశ్నలకు ఏ మాత్రం సంశయించకుండా, భయపడకుండా ధైర్యంగా, ముక్కుసూటిగా సమాధానాలు ఇచ్చాడు మన హీరో. కాంట్రవర్సీల గురించి అడిగినా.. నేను మోనార్క్‌ను నేను ఎవ్వరి మాట వినను.. ఎవ్వరు ఏమన్నా పట్టించుకోను అన్నట్లు చేసిన వ్యాఖ్యలు విజయ్ దేవరకొండను మరో మెట్టు ఎక్కించాయి. దీంతో.. దేవీ నాగవళ్లిని ఫేవరెట్ యాంకర్‌గా కొలుస్తూ వస్తున్నాడు మనోడు. ఇదే విషయాన్ని మీకు మాత్రమే చెప్తా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా బయటపెట్టాడు.

ఆ కార్యక్రమంలో.. ప్రేక్షకులకు, అభిమానులకు తెలీని సీక్రెట్ చెప్పండి అని యాంకర్లు విజయ్‌ను కోరగా.. నా ఫేవరెట్ యాంకర్ దేవీ నాగవళ్లి అని చెప్పాడు. ఈ షోకు ఆమె కూడా వచ్చారు. ఈ సందర్భంగా ఆమె కోరిన ఓ కోరికను కూడా తీర్చారు. రూ.10 కాయిన్‌ను బ్యాన్ చేశారని వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఆర్బీఐ ప్రకటన ఇచ్చినా ఎవ్వరూ వాడటం లేదని.. మీర చెబితే కాయిన్ వాడకంలోకి వస్తుందని దేవీ కోరడంతో.. తన అభిమానులకు విజయ్ ఈ సందేశాన్ని ఇచ్చి ఓ మంచి పనికి తన వంతు సహాయం అందజేశాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!