లాస్య పెళ్లికూతురాయనే!

బుల్లితెరపై యాంకర్ రవితో కలిసి ఎన్నో టీవీ షోలు చేసిన లాస్యకు అభిమానగణం బాగానే ఉంది. ఈ మధ్యనే ఆమెకు సినిమా అవకాశాలు రావడంతో బుల్లితెరకు కాస్త బ్రేక్ వచ్చింది. ప్రస్తుతం లాస్య ‘రాజా మీరు కేక’ సినిమాలో నటిస్తోంది. అయితే ఈరోజు ఆమెకు మరాఠీకు చెందిన
మంజునాథ్ అనే వ్యక్తితో నిశ్చితార్ధం జరిగినట్లు తెలుస్తోంది.

ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. ఈరోజు ఎంతో ప్రత్యేకమైన రోజు.. ఇతడే నా సోల్ మేట్.. మంజునాథ్ అని తనకు కాబోయే భర్తను కూడా పరిచయం చేసింది. మొత్తానికి ఆమె ఆరోగ్యం బాలేదని, ఓ యంగ్ హీరోతో ప్రేమ వ్యవహారం నడిపిస్తోందని వచ్చిన రకరకాల వార్తలకు ఆమె ఎంగేజ్మెంట్ తో సమాధానం చెప్పింది.