ఆ షో అడల్ట్ కోసం.. ఏది తీసుకోవాలో.. ఆ కెపాసిటీ మేం మీకు ఇస్తున్నాం

జబర్దస్త్ కామెడీ షోతో హాట్ యాంకర్‌గా పేరొందిన రష్మి గౌతమ్.. హీరోయిన్‌గానూ పలు సినిమాల్లో నటించింది. ఇక అప్పుడప్పుడూ రిబ్బన్ కటింగ్స్‌తో జనం మధ్యకు వచ్చి షాపింగ్ మాల్స్‌లో హడావిడి చేస్తున్న రష్మి తాజాగా తెలంగాణలోని మంచిర్యాలలో క్విక్కర్ బజార్ షాపింగ్ మాల్ ఓపెన్ చేసింది. మంగళవారం నాడు జరిగిన ఈ కార్యక్రమంలో రష్మిని చూసేందుకు జనం ఎగబడ్డారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రష్మి తన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి తెలియజేస్తూ కాంట్రివర్శి ఇష్యూస్‌పై ఫైర్ అయ్యారు. ప్రస్తుతం తాను హీరో నందుతో కలిసి ఓ ప్రాజెక్ట్ చేస్తున్నానని.. ప్రస్తుతం వైజాగ్‌లో షూటింగ్ జరుగుతుందని చెప్పారు. ఇక మీరు తరచూ వివాదాల్లో వ్యక్తిగా ఉంటున్నారు, జబర్దస్త్‌లో డబుల్ మీనింగ్స్ ఎక్కువ ఉంటున్నాయి.. ఆ ప్రభావం పిల్లలపై పడుతుంది. అని విలేకరి ప్రశ్నించడంతో ఫైర్ అయ్యింది రష్మి.

‘కాంట్రివర్శిలు మేం చేయడం లేదు.. మేం చాలా క్లీన్ ఎంటర్‌టైన్మెంట్ అందించాలని అనుకుంటున్నాము. దాన్ని మీరు చూసే విధానంలో ఉంటుంది. పైగా ప్రైమ్ టైమ్ షో అనేది అడల్ట్ కోసం. వాళ్ళకు సొంతంగా ఓ ఆలోచన ఉంటుంది. ఏది తీసుకోవాలి.. ఏది ఫిల్టర్ చేయాలని అని. ఆ కెపాసిటీ మేం మీకు ఇస్తున్నాం. అది మీ దగ్గర ఉంటుంది. ఓటు హక్కుతో పాటు.. ఆలోచించే హక్కు కూడా మీకు ఉంది. సరిగా ఆలోచించండి’ అంటూ తెలివిగా సమాధానం చెప్పింది యాంకర్ రష్మి.

CLICK HERE!! For the aha Latest Updates