HomeTelugu Big Storiesఅనసూయ దుస్తులపై యాంకర్‌ ప్రశ్న.. బ్యూటీ వాకౌట్‌

అనసూయ దుస్తులపై యాంకర్‌ ప్రశ్న.. బ్యూటీ వాకౌట్‌

Anchor shiva about anasuya

అనసూయ యాంకర్‌ గా ఈటీవీలో ప్రసారమవుతున్న కామెడీ షో ‘జబర్దస్త్‌’. రోజా, మనో జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. కాగా, త్వరలో ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. హైపర్‌ ఆది స్కిట్‌లో భాగంగా యాంకర్‌ శివ ‘జబర్దస్త్‌’ స్టేజ్‌పై తళుక్కున మెరిశారు. స్కిట్‌ అనంతరం.. ‘అనసూయ.. ఎప్పటినుంచో మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని ఉంది. మీ డ్రెస్సింగ్‌ స్టైల్‌ గురించి తరచూ నెగెటివ్‌ కామెంట్లు వస్తుంటాయి. చిన్న చిన్న దుస్తులు ఎందుకు వేసుకుంటున్నారని అందరూ అంటుంటారు?’ అని అడిగాడు.

దానికి అనసూయ .. దానికి ‘ఇండస్ట్రీ గురించి తెలియని వాళ్లు అడిగారంటే అర్థం చేసుకోవచ్చు. మీరు ఇక్కడే ఉంటున్నారు. మీకు ఇండస్ట్రీ గురించి తెలిసి కూడా ఇలా ఎలా అడుగుతున్నారు? అయినా ఇది నా పర్సనల్‌’ అని సమాధానమిచ్చారు అనసూయ. ‘మీ పర్సనల్‌ అయితే ఇంట్లో చూసుకోవచ్చు కదా?ఇక్కడ ఎందుకని?’ శివ అనగానే.. అనసూయ ఫైర్‌ అయింది. సెట్‌ నుంచి బయటకు వెళ్లిపోయింది. దీంతో ‘జబర్దస్త్‌’ సెట్‌లో ఉన్నవాళ్లందరూ ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్‌ చూడాలంటే వచ్చే గురువారం ఎదురు చూడాల్సిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu