సడక్‌-2 సినిమాకి మరో సమస్య


బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం అనంతరం బాలీవుడ్ వర్గాల్లో ఒక్కసారిగా భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. నెపోటిజం అనేది ఎక్కువగా వినిపిస్తోంది. సుశాంత్ మరణానికి న్యాయం చేయాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా నెపోటిజంకు సంబంధించి మొదటి నుంచీ ఆరోపణలు ఎదుర్కొంటున్న మహేష్ భట్ తెరకెక్కించిన “సడక్ 2” ట్రైలర్ విడుదల అయ్యింది. మహేష్ భట్ మరియు సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తికి సంబంధించి పలు అంశాలు కూడా బయటికొస్తున్నాయి. సుశాంత్ అభిమానులు మరియు సానుభూతిపరులు ఈ ట్రైలర్ కు ఊహించని రేంజ్ లో డిస్ లైక్స్ తో షాకిచ్చారు. దీంతో చిత్ర యూనిట్ నిరాశకు గురైంది.

తాజాగా ఈ చిత్రానికి మ‌రో స‌మ‌స్య వ‌చ్చింది. అలియాభ‌ట్‌, ఆదిత్యారాయ్ క‌పూర్ మ‌ధ్య ఇష్క్ క‌మాల్ అంటూ సునిల్‌జీత్ కంపోజిష‌న్ లో వ‌చ్చిన‌ పాట..త‌న పాట‌కు కాపీ అని ఫిల్మ్ మేక‌ర్‌, మ్యూజిక్ కంపోజ‌ర్ శెజాన్ స‌లీమ్ ఆరోపిస్తున్నాడు. 2011లో తాను పాకిస్థాన్ లో లాంచ్ చేసిన ర‌బ్బా హో పాట‌ను కాపీ చేశారంటున్నాడు. దీనిపై సునిల్ జిత్ స్పందిస్తూ..ఇష్క్ క‌మాల్ సాంగ్ తాను స్వయంగా కంపోజ్ చేశానని, ఏ పాట‌కు కాపీ కాద‌ని అన్నాడు. ప్రముఖ సింగ‌ర్ జావెద్ అలీతోపాటు చాలా మంది క‌ష్ట‌ప‌డి ఈ పాట‌ను సిద్దం చేశారని, త‌న మ్యూజిక్ కూడా దీనికి ప్ల‌స్ అయింద‌ని సునీల్ జిత్ అన్నాడు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా ఇది నాకు మొద‌టి పాట‌. సంగీత ప్రియులు, ప్ర‌జ‌ల‌కు ఈ పాట త‌ప్ప‌కుండా న‌చ్చుతుంద‌న్న ఆశాభావం వ్య‌క్తం చేశాడు.

CLICK HERE!! For the aha Latest Updates