భారీ ఆఫర్‌ కొట్టేసిన అను ఇమ్మానుయేల్‌..!

తెలుగులో నటించిన శైలజా రెడ్డి అల్లుడు సినిమా మంచి విజయం సాధించిన అను ఇమ్మానుయేల్ కు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. వినాయక చవితి సందర్భం గా విడుదలైన ఈ సినిమా.. నాగ చైతన్య కెరీర్లో అత్యధిక వసూళ్లు రాబడుతున్న సినిమాగా నిలిచింది. ఇప్పటికే మంచి టాక్ ను సొంతం చేసుకున్నది.

ఈ నేపథ్యంలో అను ఇమ్మానుయేల్ తాజాగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఓ సినిమాకు సైన్ చేసినట్టు సమాచారం. నాగార్జున, ధనుష్ లు హీరోగా నటిస్తున్న మల్టీస్టారర్ సినిమాలో అను నటిస్తున్నది. ధనుష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. త్రెండాల్ ఫిల్మ్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తున్నది. అతిథిరావు హైదరి, శరత్ కుమార్, ఎస్.జె.సూర్య, తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.