HomeTelugu Trendingనిఖిల్‌ తో రొమాన్స్‌ చేయనున్న "మజ్ను" హీరోయిన్‌!

నిఖిల్‌ తో రొమాన్స్‌ చేయనున్న “మజ్ను” హీరోయిన్‌!

8 28
నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటించిన “మజ్ను” సినిమాతో ఎంట్రీ ఇచ్చింది మాలీవుడ్ బ్యూటీ అను ఇమ్మాన్యూయేల్. తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ‘అజ్ఞాతవాసి’ సినిమా నటించింది. దాంతో ఈ బ్యూటీకి వరుస అవకాశాలు వస్తాయని భావించారు. కానీ ఈ మూవీ డిజాస్టర్ కావడంతో ఈ బ్యూటీకి ఛాన్సులు రాలేదు. ఆ తర్వాత అల్లు అర్జున్ “నా పేరు సూర్య” సినిమాతో మరో ఫ్లాప్‌ను అందుకుంది. తాజాగా ఈ అమ్మడు టాలీవుడ్ యంగ్ హీరోతో కలిసి నటిస్తుంది. నిఖిల్ హీరోగా
రూపొందుతోన్న ’18 పేజెస్’ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటించనుందట. కొన్ని రోజుల క్రితం కృతి శెట్టి పేరు వినపడ్డప్పటికీ అను ఇమ్మాన్యుయేల్‌కే మేకర్స్ మొగ్గు చూపారట. ప్రస్తుతం అనుతో చర్చలు జరుపుతున్నారట. పల్నాటి సూర్యప్రతాప్ తెరకెక్కించనున్న ఈ చిత్రానికి సుకుమార్ కథ, మాటలు అందిస్తున్న విషయం తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!