వరుసగా మూడోసారి!

బాహుబలి సినిమాను పూర్తి చేసిన ప్రభాస్ అనంతరం ‘సాహో’ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా పలువురు బాలీవుడ్ ముద్దుగుమ్మల పేర్లు వినిపించాయి. వారు భారీ పారితోషికాలు అడిగారానే కారణంతోనే చిత్రబృందం వెనుకడుగు వేసిందని తెలుస్తోంది. అయితే ఎలాగైనా క్రేజ్ ఉన్న హీరోయిన్ ను తీసుకోవాలని భావిస్తోన్న చిత్రబృందం హీరోయిన్ గా అనుష్కకు ఫిక్స్ అయిందని సమాచారం.

ప్రభాస్ తో ఇప్పటికే మిర్చి, బాహుబలి1, బాహుబలి2 వరుస చిత్రాల్లో నటించిన అనుష్క ఇప్పుడు ముచ్చటగా మూడోసారి అతడితో జత కట్టడానికి రెడీ అవుతోందని ఫిల్మ్ నగర్ టాక్. రెమ్యూనరేషన్ విషయంలో కూడా అనుష్కకు మూడు కోట్లతో సరిపెట్టినట్లు ఉంటుంది అలానే బాహుబలి కాంబినేషన్ రిపీట్ చేసినట్లు ఉంటుంది.